క్రీడలతోనే శారీరక దారుఢ్యం
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:33 PM
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం కలుగుతుందని జిల్లా అదనపు కలెక్ట ర్ చంద్రయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన 2025-26 జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్స్ట్ ఎం పిక క్రీడలకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.
మందమర్రిటౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం కలుగుతుందని జిల్లా అదనపు కలెక్ట ర్ చంద్రయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన 2025-26 జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్స్ట్ ఎం పిక క్రీడలకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. కుల, మత, వర్గ విభే దాలు లేని ప్రదేశం ఏదైనా ఉందంటే అది క్రీడా మైదామేనని పేర్కొన్నా రు. క్రీడాకారులు వారెంచుకున్న ప్రతి రోజు సాధన చేయడం ద్వారానే విజ యాలు సాధిస్తారన్నారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగ రేణి పాఠశాల మైదానం క్రీడలకు వేదికగా మారిందన్నారు. అందుకే పాఠ శాల మైదానాన్ని అన్ని క్రీడలకు సంబంధించి మెరుగు పరిచామన్నా రు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. క్రీడా మైదానంలో వి ద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. క్రీడాకారులను సింగరేణి ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం వారు క్రీడాకారులను పరిచ యం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలం పిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గ ప్రసాద్, సీఐ రమేష్, ఎస్‌ఐ నరేష్, క్రీడల నిర్వహకులు రాంవేణు, పీడీ రోజా, వరకుమారి, సుకుమార, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.