సిట్ విచారణతో ఒరిగేదేమీ లేదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:14 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో...
సిట్ అధికారుల వద్ద ఉన్నది 15 రోజుల డేటా మాత్రమే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షి శివకుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో అప్పట్లో ఆయన ఫోన్ నెంబర్ ట్యాపింగ్ అయ్యిందని సిట్ అధికారులు గుర్తించి శివకుమార్‌ను సాక్షిగా విచారణకు పిలిచారు. విచారణ అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సిట్ విచారణ వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. తనకు మునుగోడు ఎన్నికల్లో రోలర్ గుర్తు లభించిందని, ఆ గుర్తు వల్ల ఎవరికి ప్రయోజనం లభిస్తుందో తెలుసుకోవడం కోసం తన ఫోన్లను నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ట్యాప్ చేయించాడని ఆయన పేర్కొన్నారు. సిట్ అధికారులు తనకు కొన్ని ఆధారాలు చూపించారని, వారి వద్ద కేవలం 15 రోజుల డేటా మాత్రమే ఉందని పేర్కొన్నారు. దీనివల్ల ఏం సాధిస్తారని, ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని, స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ టీఆర్‌ఎ్‌సగా కన్పిస్తుందని శివకుమార్ అన్నారు.