‘ఫోన్ ట్యాపింగ్’లో తుది చార్జిషీట్‌పై సిట్ కసరత్తు
ABN , Publish Date - May 20 , 2026 | 03:56 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జీషీట్‌ను దాఖలు చేయడానికి సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగానే నెల రోజుల వ్యవధిలో 50 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులను...
నెల రోజుల వ్యవధిలో 50 మందికిపైగా విచారణ
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జీషీట్‌ను దాఖలు చేయడానికి సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగానే నెల రోజుల వ్యవధిలో 50 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులను సిట్ అధికారులు విచారించారు. తాజాగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డిని బుధవారం విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను క్రోడికరిస్తున్న అధికారులు.. అనుమానితులెవరు? బాధితులెవరు? ట్యాపింగ్‌కు సహకరించిన వారెవరు? అనే అంశాలకు సంబంధించి వేర్వేరుగా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగానే ఇద్దరు జర్నలిస్టులను ప్రశ్నించామని, వారు స్వచ్ఛందంగా సహకరించారని సిట్ అధికారులు వివరించారు. ఈ విషయమై ఒక పత్రికలో, కొన్ని సోషల్‌మీడియా వేదికల్లో జర్నలిస్టులకు వేధింపులంటూ అసత్య కథనాలు వచ్చాయని, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.