Share News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ‘యుగతులసి’ శివకుమార్‌కు నోటీసులు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:17 AM

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షుల విచారణలో భాగంగా యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ‘యుగతులసి’ శివకుమార్‌కు నోటీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షుల విచారణలో భాగంగా యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరు సాక్షుల వాంగ్మూలాలు మళ్లీ తీసుకోవాల్సిన అవసరమున్న నేపథ్యంలో చాలామందికి సిట్‌ నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తుది చార్జ్‌షీట్‌కు సన్నద్ధమవుతున్నట్లు పోలీసులు ఇటీవలే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలను ఇప్పటికే సిట్‌ అధికారులు విచారించారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును సుదీర్ఘంగా విచారించి తదుపరి ఫైనల్‌ చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని సిట్‌ అధికారులు ఇటీవలే వెల్లడించారు.

Updated Date - Apr 26 , 2026 | 04:17 AM