Share News

kumaram bheem asifabad- స్థాయి పెరగని పీహెచ్‌సీ

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:27 PM

గ్రామీణ ప్రాంతాల ఆసుపత్రులపై ప్రభత్వుం దృష్టి సారిసు ్తన్నా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) స్థాయిని పెంచక పోవడంతో ఆశించిన స్థాయిలో వైద్య సేవలందడం లేదు. అత్యవసర పరిస్థితుుల్లో పీహెచ్‌సీకి వచ్చే రోగులకు ప్రథమ చిక్సిత అందించి మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. రెబ్బెన పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేస్తే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని మండలవాసులు చెబుతున్నారు.

kumaram bheem asifabad- స్థాయి పెరగని పీహెచ్‌సీ
రెబ్బెనలో ఉన్న పీహెచ్‌సీ కేంద్రం

- సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేయాలని మండలవాసుల వినతి

రెబ్బెన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ఆసుపత్రులపై ప్రభత్వుం దృష్టి సారిసు ్తన్నా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) స్థాయిని పెంచక పోవడంతో ఆశించిన స్థాయిలో వైద్య సేవలందడం లేదు. అత్యవసర పరిస్థితుుల్లో పీహెచ్‌సీకి వచ్చే రోగులకు ప్రథమ చిక్సిత అందించి మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. రెబ్బెన పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేస్తే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని మండలవాసులు చెబుతున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలం దించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రి పరిఽధిలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నారు. సుమారు 40వేల జనాభా ఉంది. ప్రతీ రోజు వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రతి నెలా ప్రసవాలు జరుగుతుంటాయి. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను ఇక్కడికి తరలిస్తే సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలకు పంపిస్తుం టారు. ఆసుపత్రికి చేరేలోపే క్షతగాత్రుల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.

- సీహెచ్‌సీగా

రెబ్బెన పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేస్తే మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలం దించేందుకు అవకాశం ఉంటుంది. ఆసుపత్రి పరిధిలో జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీహెచ్‌సీని సీహెచ్‌సీ స్థాయికి పెంచేందుకు అధికారులు చొరవ చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రోజూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు, క్షేత్ర స్థాయిలో వాక్సినేషన్‌ ఇతర కార్యక్రమాలు పరిశీలిం చేందుకు ఆసుపత్రిలో కేవలం ఒక వైద్యాధికారి మాత్రమే ఉన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలంటే భారంగా మారుతోంది. మరో వైద్యుడిని నియమిస్తే ప్రజలకు అందుబాటులో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ఆసుపత్రిలో ఆరు పడకలు మాత్రమే ఉండడంతో రోగులకు ఎటూ సరి పోవడం లేదు. సీహెచ్‌సీగా మారితే 25 పడకల స్థాయికి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ దిశగా చర్యలు తీసు కోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 10:27 PM