Harassment: ఫార్మసిస్టుపై వైద్యాధికారి లైంగిక వేధింపులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:40 AM
కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి లింగాల నాగ గిరీశ్‌పె లైంగిక వేధింపులతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి..
వైద్యాధికారిపై అట్రాసిటీ కేసు నమోదు
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఘటన
బీర్కూర్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి లింగాల నాగ గిరీశ్‌పె లైంగిక వేధింపులతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. బీర్కూర్ పీహెచ్‌సీలో బాదావత్ మౌనిక రెండేళ్లుగా ఆయుర్వేదిక్ ఫార్మసిస్టుగా పని చేస్తున్నారు. ఆరు నెలలుగా వైద్యాధికారి గిరీశ్ తనను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెడుతున్నారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో ఇంటికెళ్తున్న తనను అడ్డుకుని గిరీశ్ తన బైక్‌పై తీసుకెళ్లాడని, ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో గిరీశ్‌పై కేసు నమో దు చేసినట్లు బీర్కూర్ ఎస్‌ఐ మహేందర్ వివరించారు.