Share News

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - May 31 , 2026 | 11:35 PM

కేం ద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను త గ్గించాలని బహుజన్‌ సమాజ్‌ ముక్తి పారీ (బీఎంపీ) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో ఆటోను తోస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న బీఎంపీ నాయకులు

తాడూరు, మే 31 (ఆంధ్రజ్యోతి) : కేం ద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను త గ్గించాలని బహుజన్‌ సమాజ్‌ ముక్తి పారీ (బీఎంపీ) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని బ స్టాండ్‌ కూడలిలో తోపుడు బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం విజయ్‌ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు పెట్రోల్‌, డీజి ల్‌ కొనలేక తమ వాహనాలను తోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. వెంట నే ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అ దేవిధంగా గృహ వినియోగానికి సిలిండర్‌ ధర తగ్గించాలని కోరారు. వెంటనే స్మార్ట్‌ మీటర్లను తీసివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో బహుజన్‌ ముక్తి పార్టీ నాయకులు గడ్డం అంజి, మద్దిలేటి, బీసీ సంఘం నాయ కులు గొర్ల సుల్తాన్‌, చింతకాయల నారాయణ, అంబేడ్కర్‌ సంఘం నాయకులు జెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 11:35 PM