అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:25 PM
ప్ర జావాణిలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్క రించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : ప్ర జావాణిలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్క రించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి లో అందిన ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధా న్యంగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరిం చాలని అధికారును ఆదేశించారు. ప్రజావాణికి 56 వినతులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, డీఆర్‌వో పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికా రులు, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
పోషక అభియాన్‌లో భాగంగా తల్లిపాల వారోత్సవాలను పకడ్బందీగా నిర్వ హించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జి ల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కోసం రూపొందించిన వాల్‌పోస్టర్లను క లెక్టర్ ఆవిష్కరించారు. తల్లిపా లపై ప్రజల్లో ఉన్న అపోహలను శాస్త్రీయ ఆధారాలతో తొలగించి ప్రతీ తల్లి తన బిడ్డకు తల్లిపాలే ఉత్తమ ఆహారమనే సందేశాన్ని చేరవేయాలని ఆదేశించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, దేవసహా యం, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణికి 10 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ క్రైం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ని ర్వహించిన పోలీస్ ప్రజావాణికి 10 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నా రు. ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడివారి సమ స్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు పరిష్కారానికి సూచనలు చేస్తూ, సిఫారసు చేశారు. భూ మికి సంబంధించి 7, తగు చర్యల గురించి 3 ఫిర్యాదులు స్వీకరించి నట్లు ఆయన తెలిపారు.