చేతులు తడిపితేనే..అనుమతులు
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:16 PM
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఏర్పా టు చేస్తున్న టపాసుల దుకాణాల వ్యాపారులను అధి కారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిబంధనలు పాటించినప్పటికీ వేలకు వేలు లంచాలు డిమాండ్ చే స్తున్నట్లు వాపోతున్నారు. టపాసుల దుకాణాలు ఏర్పా టు చేయాలంటే అగ్ని మాపక శాఖతో పాటు పోలీసు, మున్సిపల్ , విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
టపాసుల వ్యాపారులపై అధికారుల ఝులుం
శాఖల వారీగా ముడుపులకు డిమాండ్
నిబంధనలు పాటించినా తప్పని చెల్లింపులు
అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
తీరుమారని అధికారులు
మంచిర్యాల, నవంబర్ 6(ఆంధ్రజ్యోతి) : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఏర్పా టు చేస్తున్న టపాసుల దుకాణాల వ్యాపారులను అధి కారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిబంధనలు పాటించినప్పటికీ వేలకు వేలు లంచాలు డిమాండ్ చే స్తున్నట్లు వాపోతున్నారు. టపాసుల దుకాణాలు ఏర్పా టు చేయాలంటే అగ్ని మాపక శాఖతో పాటు పోలీసు, మున్సిపల్ , విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తమకు టపాసుల షాపులు ఏర్పాటు చేసేందుకు లైసెన్సులు ఉండగా అన్ని నిబంధనలు పాటిస్తున్నా ముడుపుల కో సం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు వ్యాపారులు లబోదిబోమం టున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని శా ఖల అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఇబ్బందులు ప డాల్సి వస్తుందని చెబుతున్నారు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. ఇందుకోసం ప్రజలు వేల రూపాయలను ఖర్చు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. ప్రజల అభిరుచులకు అ నుగుణంగా వ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో బాణాసంచా తెప్పించి అందుబాటులో ఉంచుతారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే ట పాసుల షాపులలో మూడు రోజుల పాటు ప్రజలు కొ నుగోళ్లు జరుపుతుండగా ఇప్పటికే లక్షలాది రూపాయ ల సరుకును వ్యాపారులు అందుబాటులో ఉంచారు. షాపుల ఏర్పాటు కోసం లక్షలు వెచ్చించినప్పటికీ వివి ధ శాఖల అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించాల్సి రావడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు అ య్యే పరిస్ధితులు కనిపించడం లేదని వ్యాపారులు ఆం దోళన చెందుతున్నారు.
జిల్లాలో 116 షాపులకు అనుమతి...
దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం ఫైర్ స్టేషన్ల పరిధిలో మొత్తం 116 టపాసుల దుకాణాలకు ఆయా శాఖల అ ధికారులు అనుమతులు ఇచ్చారు. మంచిర్యాల నగరం లో 54 షాపులు ఏర్పాటు చేస్తుండగా బెల్లంపల్లిలో 43, చెన్నూరులో 9, జన్నారంలో పది షాపులకు అనుమతు లు లభించాయి. మంచిర్యాల నగరడంలో ఆయా షాపు లకు అనుమతులు ఇచ్చేందుకు వివిధ శాఖల అదికా రులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేసినట్లు ప్రచారం జ రుగుతోంది. మంచిర్యాల నగరంలో ఒక్కో షాపునకు కొంత మొత్తం ధర నిర్ణయించినట్లు సమాచారం. ఇం దులో భాగంగా అగ్నిమాపక శాఖకు రూ. 7 వేలు, పోలీ సు శాఖ సిబ్బందికి రూ. 2 వేల విలువ గల టపాసు లు, అలాగే మున్సిపల్, విద్యుత్ శాఖలు కూడా ముడు పులు వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోం ది. ముడుపులు చెల్లించనిదే ఆయా శాఖలు ఫైళ్లు ముం దుకు కదలనివ్వలేదని సమాచారం. ఓ వైపు అన్ని ని బందనలు ఉండాలంటూనే మరో వైపు లంచాలు ము క్కు పిండి వసూలు చేస్తుండడంతో వ్యాపారులు లబో దిబోమంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎక్కడ లేని విధం గా నిబందనలు అమలు చేస్తూ ఇబ్బందులు పెడుతు న్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలలో నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోని అధికా రులు జిల్లా కేంద్రంలో లేనిపోని ఆంక్షలు విధించడం ప ట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీకి పట్టుబడినా రాని మార్పు....
గతంలో టపాసుల దుకాణాలలో బలవంతపు వసూ ళ్లకు పాల్పడిన పలు శాఖల అధికారులు ఏసీబీకి ప ట్టుబడిన సంఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. అధి కారుల ఒత్తిడి భరించలేక ఓ వ్యాపారి ఏసీబీని ఆశ్ర యించగా నలుగురు అధికారులపై చర్యలు తీసుకు న్నా రు. అయినప్పటికి ఆయా శాఖలలో మార్పు రాక పో వడం గమనార్హం. మళ్లీ అదే దారిలో పయనిస్తూ లం చాల కోసం ఒత్తిడి చేస్తుండడం వివాదానికి దారి తీ స్తుంది. కొన్ని చోట్ల తడకలతో షాపులు ఏర్పాటు చే స్తున్నప్పటికీ పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్రంలో రేకులతో షెడ్లు నిర్మిస్తూ నిబంధనల మేరకే షాపులు ఏర్పాటు చేసినప్పటికీ ముడుపుల కోసం ఒత్తిడి చేయ డం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించాల్సి వ స్తున్నందున షాపులు నిర్వహించేలేని స్థితిలో వ్యాపా రులు ఉన్నారు.