Share News

ఇసుక తరలింపునకు అందరికీ అనుమతులివ్వాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:43 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తరలించేందుకు కొన్ని టాక్ట్రర్లకు మాతమ్రే అనుమతి ఇస్తున్నారని, మిగతావారికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఏపూర్‌ గ్రామస్థులు ప్రశ్నించారు

ఇసుక తరలింపునకు అందరికీ అనుమతులివ్వాలి
ఏపూర్‌ ఏటి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు

ఆత్మకూర్‌ (ఎస్‌), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తరలించేందుకు కొన్ని టాక్ట్రర్లకు మాతమ్రే అనుమతి ఇస్తున్నారని, మిగతావారికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఏపూర్‌ గ్రామస్థులు ప్రశ్నించారు. గురువారం సుమారు 20 ట్రాక్టర్లు తహసీల్దార్‌ అనుమతితో ఇసుక తరలించారు. ఇంద్ర అనే మహిళ ఇంటికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్న వారు ఇతర నిర్మాణాలకు ఇసుక విక్రయిస్తున్నారని ఆరోపించారు. మరికొందరు ఇసుక డంప్‌ చేసుకొని తర్వాత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జాజిరెడ్డిగూ డెం నుంచి అన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటున్నారని. ఇక్కడ కొంతమంది దళారులు అధిక ధరలకు విక్రయించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతు న్నారని గ్రామస్థులు ఆరోపించారు. అనుమతుల పేరుతో వందలాది ట్రాక్టర్ల ఇసుకను అకమ్రంగా తరలిస్తున్నారని, అడ్డుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఏపూర్‌ ఏటి నుంచి ఇసుకను అక్రమంగా తరలించకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ను వివరణ కోరగా ఏపూర్‌ గ్రామస్థులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కావాలని దరఖాస్తు చేసుకున్నారని వారికి అనుమతులు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 45 ఇళ్ల నిర్మాణాలకు 17 ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇసుక అకమ్రంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Updated Date - Feb 27 , 2026 | 12:43 AM