Share News

kumaram bheem asifabad- గణేశ్‌ ఉత్సవాలకు అనుమతి పొందాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 10:45 PM

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిర్వాహకులు అనుమతులు పొందాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ అన్నారు. సిర్పూరు(టి) రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయాలన్నారు. తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. విద్యుత్‌ అధికారులు సూచిస్తున్న సూచనలు పాటించాలని చెప్పారు.

kumaram bheem asifabad- గణేశ్‌ ఉత్సవాలకు అనుమతి పొందాలి
మాట్లాడుతున్న డీఎస్పీ వహిదుద్దీన్‌

సిర్పూరు(టి), సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిర్వాహకులు అనుమతులు పొందాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ అన్నారు. సిర్పూరు(టి) రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయాలన్నారు. తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. విద్యుత్‌ అధికారులు సూచిస్తున్న సూచనలు పాటించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లఘించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌ రహీమోద్దీన్‌, సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై సాగర్‌, ఉపసర్పంచ్‌ దుర్గం ప్రశాంత్‌, మాజీ ఉపసర్పంచ్‌ కోట మహేష్‌, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహిం చాలని ఎస్సై కమలాకర్‌ తెలిపారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. వివిధ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే గణనాథుల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుకుండా చూడాలన్నారు. అలాగే విద్యుత్‌ అధికారులు సూచించే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. నవరాత్రి వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంనిర్వహించాలని కౌటాల సీఐ సంతోష్‌, ఎస్సై సతీష్‌ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండపాల ఏర్పాటు వద్ద పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

Updated Date - Sep 10 , 2026 | 10:45 PM