ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:25 PM
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరఏట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆ ర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరఏట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆ ర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాసిపేట మండలం కొత్తవరి పేట గ్రామానికి చెందిన బానోత్ దేశాయ్ తనకు గ్రామంలో గల భూమి నిషేధిత జాబితాలో చూపుతుందని, సవరవించాలని కోరుతూ దరఖాస్తు అందించారు. వేమనపల్లి మండలం సుంపుటం గ్రామానికి చెందిన కుబిడె వెంకటేశం రైతులతో కలిసి నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువలో పూడు కుపోయిన మట్టిని తొలగించి సాగునీటిని అందించాలని కోరుతూ దరఖాస్తు అందించారు. నస్పూర్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెంది న లిక్కి శంకరయ్య తన కూతురుకు గిప్ట్ డీడ్ ద్వారా ఆస్తి ఇచ్చానని, ఇ ప్పుడు తనకు ఎలాంటి ఆధారం లేదని, తనకు అట్టి ఆస్తిని తిరిగి ఇప్పిం చాలని కోరుతూ ఆర్జీ అందించారు. అలాగే కోటపల్లి, మంచిర్యాల, చెన్నూరు, భీమారం, నస్పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 47 దరఖాస్తులు వచ్చా యని వాటిని పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతిరాం, అధికారులు పాల్గొన్నారు.