ప్రజలు అధైర్య పడవద్దు... అండగా ఉంటా
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:54 AM
వర్షాలతో ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పట్టణం లోని రాష్ట్రీయ రహదారి బురదగూడెం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న పాలవాగును కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : వర్షాలతో ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పట్టణం లోని రాష్ట్రీయ రహదారి బురదగూడెం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న పాలవాగును కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. వాగు ఉ ధృతి గురించి మున్సిపల్ కమిషనర్ రాజలింగును అడిగి తెలుసుకు న్నారు. మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలతో వర్షం నీరు కాలనీ ల్లోకి చేరుతుందని ప్రజలు అధైర్యపడ వద్దన్నారు. అధికారులను నీటి తొలగింపు చేపట్టాల ని ఆదేశించినట్లు తెలిపారు. బురదగూడెంలోని కా మాక్య ఆలయ సమీపంలో వాగుపై హైలెవెల్ వం తెన నిర్మాణానికి కృషి చేస్తానని, వంతెన కోసం అం చనా వేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించా రు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరుతుందని, అత్య వసరం అయితే అధికారులకు సమాచారం అందించాలన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. నీట మునిగిన పంటల వివరాలను అధికారులు సేకరించాల న్నారు. అనంతరం వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో వర్షానికి కనకలక్ష్మీ అనే మహిళ ఇళ్లు కూలిపోగా మంత్రి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానని చెప్పారు. మహిళకు సహాయం అందే లా చూడాలని తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు సూచించారు. అలాగే శిథి లావస్థలో ఉన్న సింగరేణి వాటర్ ట్యాంకును తొలగించాలని అధికా రులకు సూచించారు. ఏరియా జీఎం రాధాకృష్ణతో మాట్లాడి తొలగిస్తా మని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్, పైడిమల్లనర్సింగ్, రాచర్ల గణేష్, ఎర్ర రాజు, ఎండీ ఇసాక్,జావేద్, ఒడ్నాల శ్రీనివాస్, శశి, విజయ్ పాల్గొన్నారు.