Share News

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:30 PM

రాష్ట్రం లో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అ ధ్యక్షుడు రామచందర్‌యాదవ్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
కొల్లాపూర్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

- కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కొల్లాపూర్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అ ధ్యక్షుడు రామచందర్‌యాదవ్‌ అన్నారు. ప్రభు త్వం వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై బీ ఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం సమర్థవంతంగా పోరా డుతోందని అన్నారు. శనివారం కొల్లాపూర్‌ పట్ట ణంలోని ప్రధాన కూడలిలో మాజీ ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రు లు కేటీఆర్‌, హరీశ్‌వుల చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు క్షీరా భిషేకం చేశారు. అంతకు ముందు కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రె డ్డి నివాసం నుంచి బీఆర్‌ ఎస్‌ నాయకులు నినాదాలు చేస్తూ ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రామచందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో ప యనించాలన్నా కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కా వడం తధ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ నరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కాటం జంబు లయ్య, మునిసిపల్‌ కౌన్సిలర్‌ సాయిరాం, సింగో టం సర్పంచ్‌ ఆదిరాల యాదన్నగౌడ్‌, అలంపూ ర్‌ సురేందర్‌ రావు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, మం డల పరిధిలోని వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:30 PM