Share News

kumaram bheem asifabad- పెండింగ్‌ పనులను వేగవంతంచేయాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:46 PM

జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఏఐ, సంబంధితశాఖల అధికారులతో కలిసి ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి మండలాల్లోని జాతీయ రహదారిపై పెండింగ్‌లో ఉన్న పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

kumaram bheem asifabad- పెండింగ్‌ పనులను వేగవంతంచేయాలి
పెండింగ్‌ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఏఐ, సంబంధితశాఖల అధికారులతో కలిసి ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి మండలాల్లోని జాతీయ రహదారిపై పెండింగ్‌లో ఉన్న పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతీ పనిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్‌ షెల్టర్లు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆసిఫాబాద్‌ మండలం గుండిరోడ్డు, శివాజీచౌక్‌రోడ్డు, అయ్యప్ప ఆలయం సమీపంలోని రోడ్డు, కల్వర్టు పనులు, మోడల్‌స్కూల్‌, బూర్గుడ, ఖమనా, ఇప్పల్‌నవేగాం వద్ద బస్‌ షెల్టర్ల ఏర్పాటు చేయాలని చెప్పారు. సర్వీసు రోడ్డు, పోచమ్మ ఆలయ నిర్మాణం, విద్యుత్‌ స్తంబాల పనుల ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుర్స పోచయ్య, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడిలోని వివిధ గ్రామాల బస్‌ స్టేజీల వద్ద జాతీయ రహదారిపై బస్‌ షెల్టర్‌లను ఏర్పాటు చేయాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు. మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి పనులను శుక్రవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి పరిశీలించారు. బెండార గ్రామంలోని డిగ్రీ కళాశాల వద్ద ఇరువైపులా బస్‌ షెల్టర్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రాజీవ్‌నగర్‌, గణేష్‌పూర్‌, గోయగాం గ్రామంలో నాగదేవత ఆలయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పరిశీనల కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు అజయ్‌, మాజీ ఎంపీటీసీ వినోద్‌, సర్పంచ్‌ సతీష్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 10:46 PM