Share News

కాంట్రాక్టు కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:39 PM

జిల్లా జనరల్‌ ఆసు పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చే స్తున్న శానిటేషన్‌, పేషెంట్‌కేర్‌, సెక్యూ రిటీ సిబ్బందికి రెండు నెలలుగా పెం డింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించా లని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగ ళవారం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి వినతిపత్రం అం దజేశారు.

కాంట్రాక్టు కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు

- ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి జనరల్‌ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల వినతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా జనరల్‌ ఆసు పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చే స్తున్న శానిటేషన్‌, పేషెంట్‌కేర్‌, సెక్యూ రిటీ సిబ్బందికి రెండు నెలలుగా పెం డింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించా లని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగ ళవారం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి వినతిపత్రం అం దజేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ రెండు నెలలుగా వేత నాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని అన్నారు. సంబంధిత కాం ట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. తక్కువ జీతాలు చెల్లించడం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఇతర ఖర్చుల పేరుతో అదనపు కోతలు విధిస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి కార్మికులు బాలమణి, రాధ, కృష్ణమ్మ, రేణుక, వెంకటమ్మ, అలివేల, భాగ్యమ్మ, లక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:39 PM