వేగంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:20 PM
పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగ వంతమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అన్నారు.
- ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
అచ్చంపేటటౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యో తి) : పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగ వంతమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అన్నారు. బుధ వారం అచ్చంపేట సబ్‌డివిజన్ పోలీస్ ఆ ఫీసుతో పాటు మండల పరిధిలోని సిద్దా పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌లో రికార్డులను పరి శీలించారు. రిసెప్షన్, రైటర్ ఇతర సిబ్బంది పనితీరు పట్ల సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో పెండింగ్ కేసులపై సమీక్షించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో పరిసరాలను పరి శీలించారు. ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రశాంతమైన వాతవరణం కల్పించి, ప్రతీఫిర్యా దుపై వేగంగా స్పందించాలన్నారు. పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం అందించా ల న్నారు. బాధితులకు సకాలంలో సహాయం అం దేలా కిందిస్థాయి అధికారులకు సూచనలు ఇ వ్వాలన్నారు. స్థానిక దొంగలు ఇతర అనుమా నిత వ్యక్తులపై నిరంతర నిఘా ఉండాలన్నారు. రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులు లేకుండా నిర్ధిష్ట సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు డీఎస్పీ శ్రీని వాసులు, ఎస్‌ఐలు అంజయ్య, నరేష్ పుష్పగు చ్ఛంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.