పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:30 PM
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు.
- రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్‌కిశోర్ ఝా
శ్రీరాంపూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, పోలీస్‌స్టేషన్‌లో 5 ఎస్ విధానాన్ని తప్పక అమలు చేయాలన్నారు. రికార్డులను క్రమ పద్ధతి లో నిర్వహించాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్ష ణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా ల న్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపే క్షించవద్దన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసులు, ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టులు, పెండింగ్‌కు గల కారణాలను సీఐ అశోక్, ఎస్ సంతోష్‌లను అడిగి తెలుసుకున్నారు.