Share News

అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:47 PM

జిల్లాలోని వి విధ ప్రభుత్వ శాఖల అధికారు లు ఉపయోగిస్తున్న అద్దె వాహ నాల పెండింగ్‌ బిల్లులు చెల్లించా లని ప్రభుత్వ అద్దె వాహన య జమానుల సంఘం జిల్లా అధ్యక్షు డు అశోక్‌ డిమాండ్‌ చేశారు.

అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రభుత్వ అద్దె వాహన యజమానుల నిరసన

- ప్రభుత్వ అద్దె వాహన యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వి విధ ప్రభుత్వ శాఖల అధికారు లు ఉపయోగిస్తున్న అద్దె వాహ నాల పెండింగ్‌ బిల్లులు చెల్లించా లని ప్రభుత్వ అద్దె వాహన య జమానుల సంఘం జిల్లా అధ్యక్షు డు అశోక్‌ డిమాండ్‌ చేశారు. బుధ వారం ప్రభుత్వ అద్దె వాహన య జమానుల సంఘం ఆధ్వర్యంలో కార్లతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.అశోక్‌ మా ట్లాడుతూ డీజిల్‌, పెట్రోలు,విడిభాగాలు, భీమా, మరమ్మతులు, డ్రైవర్ల వేతనాలు తదితర నిర్వ హణ వ్యయాలు భారీగా పెరిగినా ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె రేట్లు మాత్రం మారలేదని తెలి పారు. దీంతో వాహనాలను నడపడం, రుణాలు చెల్లించడం, కుటుంబాలను పోషించడం కష్టం గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉ పాధ్యక్షుడు అబ్దుల్‌ రహమాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అద్దె రేట్లుపెంచి పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉ ద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో అద్దె వాహన యజమానుల సంఘం నాయకులు శంకర్‌, బాలరాజుగౌడ్‌, నరేందర్‌, రామకృష్ణ, శ్రీధర్‌, సందీప్‌, కాశీ, కురుమూర్తి, వినోద్‌, డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 10:47 PM