పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:50 PM
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువా రం మండలంలోని చాకపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వేను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువా రం మండలంలోని చాకపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ప్రక్రియ అమలు, సర్వేపనుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భూ రీసర్వే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం బెల్లంపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తాండూర్ మండలంలో చేపట్టిన భూ రీసర్వే పనుల పురోగతిపై సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలం దించడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన సమస్యలను ని బంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అను గుణంగా భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న ఉన్నారు.