Share News

kumaram bheem asifabad- ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 10:57 PM

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నిక ల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలోని 50 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించారు. 43,754 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 67.17 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 28 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 13,927 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 2203 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగ 11 గంటల వరకు 5553, 1 గంట వరకు 8596, 3 గంటల వరకు 10,117 పోలింగ్‌ పూర్తయ్యే సరికి మొత్తం 10,817 మంది ఓటుహక్కు వినియోగించుకోగ ఇందులో 5333 మంది పురుషులు, 5483 మంది మహిళలు ఇతరులు ఒక్కరు ఓటు వేశారు.

kumaram bheem asifabad- ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు
ఆసిఫాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

- 67.17 శాతం పోలింగ్‌ నమోదు

- ఓటుహక్కు వినియోగించుకున్న 43,754 మంది ఓటర్లు

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నిక ల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలోని 50 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించారు. 43,754 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 67.17 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 28 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 13,927 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 2203 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగ 11 గంటల వరకు 5553, 1 గంట వరకు 8596, 3 గంటల వరకు 10,117 పోలింగ్‌ పూర్తయ్యే సరికి మొత్తం 10,817 మంది ఓటుహక్కు వినియోగించుకోగ ఇందులో 5333 మంది పురుషులు, 5483 మంది మహిళలు ఇతరులు ఒక్కరు ఓటు వేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపా లిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 85 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 51,205 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 5219 మంది 11 గంటల వరకు 13,487 మంది, మధ్యాహ్నం ఒంటిగం ట వరకు 22,466 మంది, మూడు గంటల వరకు 28,620 మంది పోలింగ్‌ ముగిసే వరకు 32,937 మంది ఓటు వేశారు. ఇందులో 16,101 మంది పురుషులు, 16,831 మంది మహిళలు ఇతరులు ఐదుగురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆసిఫాబా ద్‌, కాగజ్‌నగర్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల ను జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారిలు సందర్శించి పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకుని ఎన్నికల సిబ్బందికి దిశ నిర్థేశం చేశారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సహం గా పోలింగ్‌ బూత్‌లకు తరలి వచ్చారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, హైదరా బాద్‌, నాందేడ్‌ తదితర దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఓటు వేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం పూట పోలింగ్‌ మందకొడిగా జరిగిన ఆ తర్వాత పుంజుకుంది. పోలింగ్‌ కేంద్రాలకు వృద్దులను దివ్యాంగులను తరలించేందుకు సిబ్బంది వీల్‌చైర్‌లను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వీల్‌చైర్లు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఆసిఫాబాద్‌ పోలీసు అధికారులు అంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లకు గురయ్యారు. శాంతి భద్రతల పేరుతో ప్రధాన రహదారిపై నాకాబంది ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికిని మెడికల్‌ దుకాణాలను మూసి వేయించడం వాహనాలకు అనుమతించక పోవడంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్స హాన్ని ప్రదర్శించారు. మీడియాకు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన పాస్‌లు ఉన్నప్పటికీ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే క్రమంలో అడ్డుకున్నారు. ఎన్నికల పోలింగ్‌లో బాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్‌ నేతృత్వం లో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ వహిదుద్దీన్‌, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.

కాగజ్‌నగర్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నిక ు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 30 వార్డులకు 85 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తొలి గంటల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త ఓటరు జాబితా ఉండడంతో పలువురు ఓటర్లు తమ పేర్లు గుర్తించటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది ఓటర్లు పేర్లు లేక పోవటం, ఇతర వార్డుల్లో రావటంతో అంతా టెన్షన్‌కు గురయ్యారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం వివరణ ఇచ్చి అవసరమైన మార్గదర్శకాలు అందించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో రాజకీయ పార్టీలకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు తమ కార్యకర్తలతో కలిసి ఓటర్లకు సహకారం అందించారు. అన్ని పార్టీల నాయకులు కొంత మంది ఓటర్లను ఓటేసేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. వృద్ధులను తీసుకవచ్చి ఓటేయించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద వైద్య సిబ్బందికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు.

ఓటు ఉన్నా చనిపోయినట్టు తొలగించారు..

కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌కు చెందిన రాజమ్మ ఉప్పరి పాత ఓటరు జాబితాలో ఉంది. ఓటేసేందుకు ఉదయం సర్‌సిల్క్‌ శిశుమందిర్‌ పాఠశాలకు రావడంతో ఎన్నికల అధికారులు మీరు చనిపోయినట్టు ఓటరు జాబితాలో ఉందని చెప్పడంతో ఇంటిముఖం పట్టింది. తాను బతికి ఉండగానే చనిపోయినట్టు అధికారులు జాబితాలో ఉందని చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఓటను చింపిన ఓటరు..

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ రిక్షా కాలనీలో ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఓటేసేందుకు ఉదయం పూట ఎన్నికల కేంద్రానికి వచ్చాడు. ఓటేసి డబ్బాలో వేసే సమయంలో ఒక్కసారి ఎవరికి వేసానని చూసుకొని తాను వేరే పార్టీకి ఓటేశానని తెలుసుకొని చింపేస్తుండంతో అక్కడే ఉన్న అధికారులు వారించారు. దీంతో ఒక్కసారిగా ఫిట్స్‌తో పడిపోయారు. వైద్య సిబ్బంది సకాలంలో చికిత్సలు అందించారు. ఈ విషయంలో డీఎస్పీ వహీదోద్దీన్‌ పూర్తి వివరాలు సేకరించారు.

ఓటేసిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు..

మున్సిపల్‌ ఎన్నికల్లో 1వ వార్డులో నివాసం ఉంటున్న సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి కోనేరు రమాదేవి ఉదయం పూట ఓటేసేందుకు ఫాతిమా కాన్వెంటుకు పాఠశాలకు వచ్చారు. అలాగే వీరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఓటు ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటింగ్‌ సరళిపై వాకాబు చేశారు.

పోలింగ్‌పై ఎమ్మెల్సీ ఆరా..

ఉదయం పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండడంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చి ఆరా తీశారు. ఓటింగ్‌ సరళి, తదితర అంశాలు పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 10:57 PM