kumaram bheem asifabad- ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్ష
ABN , Publish Date - Mar 29 , 2026 | 10:43 PM
జిల్లాలోని పలు చోట్ల స్వశక్తి సంఘాల్లోని మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే ఉల్లాస్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల పేరిట మహిళలకు విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామంలో అమ్మకు అక్షర మాల ఉల్లాస్ పరీక్ష కేంద్రాన్ని డీఆర్‌డీవో దత్తారాం సందర్శించారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు చోట్ల స్వశక్తి సంఘాల్లోని మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే ఉల్లాస్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల పేరిట మహిళలకు విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామంలో అమ్మకు అక్షర మాల ఉల్లాస్ పరీక్ష కేంద్రాన్ని డీఆర్‌డీవో దత్తారాం సందర్శించారు. ఆయనతో పాటు ఏపీఎం, వీవోఏలు ఉన్నారు. పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లు, వసతులను పరిశీలించి పరీక్షలు సజావుగా నిర్వహించేలా సూచనలు అందించారు. మహిళల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): జైనూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు అక్షరాలు దిద్ది ఆదివారం పరీక్షలు రాశారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష ప్రశాంతగా ముగిసంది. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పరీక్షలో సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా మహిళలకు పదో తరగతి సమాన సర్టిఫికెట్ అందించే అవకాశం వచ్చిందని సమాఖ్య అధ్యక్షురాలు కొడప మోతు బాయి చెప్పారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇది గొప్ప ముందడుగని అధికారులు అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఉల్లాస్ పరీక్షల తీరును సర్పంచ్ కొడప ప్రకాష్, సమాఖ అధ్యక్షురాలు కొడప మోతుబాయిలు పరిశీలించారు. కార్యక్రమంలో సీసీ చవ్హాన్ గుణ్వంత్‌రావ్, వీవోఎస్‌లు రజిత, పుష్ప, సాధన, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మహిళలకు అమ్మకు అక్షర మాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గత పది నెలలుగా నిరక్షరాస్య మహిళలకు ప్రతి రోజు పాఠాలు బోధించిన నేపథ్యంలో ఆదివారం వారికి పరీక్ష నిర్వహించారు. మండలంలో 20 పరీక్షా కేంద్రాల్లో 836 మంది సభ్యులు పరీక్షలు రాశారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలోని లోనవెల్లిలో నిరక్షరాస్యులైన మహిళలకు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులకు పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పీవో శ్రీనివాస్, డీపీఎం యాదగిరివ, ఏపీఎం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి):్ల అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పరీక్ష కేంద్రాన్ని ఏపీఎం ప్రకాష్ సందర్శించారు. పరీక్షలకు సంబంధించి కనీస వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.