Share News

ప్రజాస్వామ్య ఉద్యమాల్లో శాంతి కమిటీలే కీలకం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:46 AM

ప్రజాస్వామ్య ఉద్యమాల్లో శాంతి కమిటీల పాత్ర కీలకమని పీస్‌ డైలాగ్‌ కమిటీ, మాజీ మావోయిస్టులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జస్టిస్‌ చంద్రకుమార్‌

ప్రజాస్వామ్య ఉద్యమాల్లో శాంతి కమిటీలే కీలకం

  • పీస్‌ డైలాగ్‌ కమిటీ, మాజీ మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య ఉద్యమాల్లో శాంతి కమిటీల పాత్ర కీలకమని పీస్‌ డైలాగ్‌ కమిటీ, మాజీ మావోయిస్టులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జస్టిస్‌ చంద్రకుమార్‌ కార్యాలయంలో శాంతి-చర్చల కమిటీ(పీస్‌ డైలాగ్‌ కమిటీ-పీడీసీ), మాజీ మావోయిస్టు అగ్రనేతల మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగింది. మాజీ మావోయిస్టు నేతలు దేవ్‌జీ టీం, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, సుజాతక్క, జేఎన్‌ఎమ్‌ సంజీవ్‌ తదితరులు పాల్గొని ప్రస్తుత దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య ఉద్యమాల ఆవశ్యకతపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ సమయంలో జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలో ఈ పీస్‌ డైలాగ్‌ కమిటీ ఏర్పాటైంది. భవిష్యత్‌ ప్రజాస్వామ్య ఉద్యమాలు-శాంతి కమిటీ ఆవశ్యకత, సెక్యులరిజం పరిరక్షణలో భాగంగా ప్రజాస్వామ్య కార్యక్రమాలను రూపొందించాలని తాజా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పీస్‌ డైలాగ్‌ కమిటీ అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్‌తోపాటు సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు కందిమళ్ళ ప్రతాప్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jun 20 , 2026 | 04:46 AM