పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:27 AM
మూడు రోజుల పాటు జరిగిన పీడీఎ్‌సయూ రాష్ట్ర 23వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఎన్నికైన రాష్ట్ర నూతన కమిటీ వివరాలను కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా కాంపాటి పృథ్వీ, ఎస్.అనిల్
ఖమ్మం కార్పొరేషన్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పాటు జరిగిన పీడీఎ్‌సయూ రాష్ట్ర 23వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఎన్నికైన రాష్ట్ర నూతన కమిటీ వివరాలను కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా కాంపాటి పృథ్వీ, ఎస్. అనిల్ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యాక్షులుగా బి.నర్సింహారావు, ఎం.నరేందర్, ఎస్.రాకేశ్, సహాయ కార్యదర్శులుగా వంగూరి వెంకటేశ్, సురేశ్, గణేశ్, బోయినపల్లి అజయ్, కోశాధికారిగా అంగిడి కుమార్ ఎన్నికయ్యారు. జాతీయ విద్యావిధానం రద్దు, హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ తదితర డిమాండ్లతో కూడిన తీర్మానాలను ఆమోదించామని వెల్లడించారు.