Share News

పేస్కేల్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:45 PM

వీబీజీ రాంజీ ఉద్యోగుల పే స్కేల్‌ అమలు చేయాలని ఉద్యోగులు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి బుఽధవారం వినతి పత్రం అందజేశారు.

పేస్కేల్‌ అమలు చేయాలి
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న వీబీజీ రాంజీ ఉద్యోగులు

- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి వీబీ జీరాంజీ ఉద్యోగుల వినతి

కందనూలు/ అచ్చంపేట/ కొల్లాపూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : వీబీజీ రాంజీ ఉద్యోగుల పే స్కేల్‌ అమలు చేయాలని ఉద్యోగులు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి బుఽధవారం వినతి పత్రం అందజేశారు. పేస్కేల్‌ అమలుతో పాటు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ వైస్‌ చైర్మన్‌ నల్ల గంటి బాలయ్య, ఏపీడీ చంద్రశేఖర్‌, ఏపీవో చం ద్రసిద్దార్థ, క్రాంతికుమార్‌, రాజేశ్‌కుమార్‌, జీవన్‌, ప్రకాశ్‌, శ్రీనివాసులు, ఇసాక్‌, మల్లికార్జున్‌, మహేందర్‌, మం జుల,మానస,లక్ష్మి పాల్గొన్నారు.

ఫ అచ్చంపేటలో బుధవా రం ఎమ్మెల్యే వంశీకృష్ణకు వీబీ జీరాంజీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఫ కొల్లాపూర్‌లో మండల పరిషత్‌ కార్యాల యంలో ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌ సేవలు విధులను పూర్తిగా నిలిపివేసి ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీఏల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, సీవోల జిల్లా అధ్యక్షు డు బాలకృష్ణ, ఉద్యోగులు మోహనకృష్ణ, రామకృష్ణ, మధు, నాగస్వామి, శ్రీను, వెంకటేష్‌, రవి, రంజిత్‌, మనిరామ్‌, నాగరాజు, ఈదన్న, మహేందర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:45 PM