-మల్లికార్జున స్వామికి మొక్కుల చెల్లింపు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:37 PM
మహాశివరాత్రిని పుర స్కరించుకుని మండలంలోని వేలాల గ్రామంలో భక్తుల రద్దీ కొ నసాగింది. ఆదివారం గుట్టపైన గట్టు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజా మున గుట్ట కిందకు పయనమయ్యారు.
వేలాలలో భక్తుల రద్దీ..
జైపూర్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రిని పుర స్కరించుకుని మండలంలోని వేలాల గ్రామంలో భక్తుల రద్దీ కొ నసాగింది. ఆదివారం గుట్టపైన గట్టు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజా మున గుట్ట కిందకు పయనమయ్యారు. వేలాల గ్రామంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకోడానికి ముందుగా గోదావరి పు ష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం వద్ద బా రులు తీరారు. ఆయాప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. మరికొంత మంది భ క్తులు గొర్రె పిల్లలతో గోదారమ్మకు మొక్కులు చెల్లించుకున్నా రు. గోదావరి సమీపాన భక్తులు తలనీలాలు సమర్పించారు. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూలైన్‌ల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిర్లు భక్తులతో నిండిపోయాయి. సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకు న్నట్లు ఆలయ ఈవో రమేష్ పేర్కొన్నారు. జాతరలో లక్ష్మీదేవర పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. మహిళలు మల్లికా ర్జున స్వామికి బోనాలు వండి నైవేద్యంగా సమర్పించారు. జై పూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జైపూర్ సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రా జశేఖర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి జాతర ప్రదేశాలను, రద్దీ ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. గోదావరి వద్ద స్నానాలు చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా నల్లాలను ఏర్పాటు చేశారు. వేలాల గ్రామ ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్య్లూఎస్ డీఈ విద్యాసాగర్, ఎంపీవో శ్రీపతి బాపురావు జాతర పనులను పరిశీలిస్తూ గ్రా మంలో, గోదావరి వద్ద పారిశుధ్యలోపం తలెత్తకుండా పంచా యతీ సిబ్బందితో చర్యలు చేపట్టారు. జాతరలో తెలంగాణ జా గృతి నాయకులు మహేష్‌గౌడ్, రాజశేఖర్‌లు మజ్జిగ పంపిణీ చేశారు. మంచిర్యాల, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఆ ర్టీసీ బస్సులు నడవగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.