బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:33 AM
తెలంగాణలో త్వరలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు.
మెరుగు పడనున్న విజయావకాశాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, పవన్‌తో తాను ప్రత్యేకంగా భేటీ అయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు రాంచందర్‌రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ప్రచారం బీజేపీ విజయావకాశాలను మరింత మెరుగుపరచనుందని పేర్కొన్నారు. ఎన్టీయే కూటమిలో జనసేన భాగస్వామి అయిన పవన్ కల్యాణ్.. పొత్తు ధర్మం పాటిస్తూ బీజీపీకి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తారని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని, ఇందుకు సంబంధించి రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నామని శంకర్‌గౌడ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.