తెలంగాణలో 2న జనసేన కీలక సమావేశం
ABN , Publish Date - May 30 , 2026 | 04:14 AM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు
హాజరుకానున్న పార్టీ అధినేత పవన్‌కల్యాణ్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా హాజరవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల గురించి కొన్ని కీలక అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జనసేన భవిష్యత్తు కార్యాచరణ పైనా దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.