Share News

kumaram bheem asifabad- పచ్చదనానికి బాటలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 10:49 PM

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సిద్ధం చేశారు. నిర్దేశిం చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాల యాలు, ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠ శాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుం టున్నారు.

kumaram bheem asifabad- పచ్చదనానికి బాటలు
లోగో

- నేడు జిల్లాలో వనమహోత్సవం ప్రారంభం

బెజ్జూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సిద్ధం చేశారు. నిర్దేశిం చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాల యాలు, ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠ శాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుం టున్నారు. అలాగే ప్రజలు, రైతులు అడిగిన మొక్క లు ఇవ్వడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు.

- పర్యావరణ పరిరక్షణే..

రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావ రణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్య క్రమాన్ని చేపడుతోంది ఇందులో భాగంగానే ఈఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్ర మాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యాచ రణ రూపొందించింది. గత ప్రభుత్వం తెలంగాణకు హరితహరం పేరుతో తొమ్మిది విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత పదో విడతనుంచి వనమ హోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.. ఈ ఏడాది వనమ హోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధమ వుతోంది. ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతిని ధుల భాగస్వామ్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇతరశాఖల అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నా టే కార్య క్రమాన్ని చేపట్టనున్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 334 గ్రామ పంచాయతీల్లో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం గా నిర్ధేశించారు. ఇందులో అన్ని శాఖలను భాగస్వా మ్యం చేయనున్నారు. ఈ సారి డీఆర్‌ డీఏ ఆధ్వర్యం లో 32,64, 997 మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో మిగితా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 7,47,000, ఆర్‌ అండ్‌బీ ఆధ్వర్యంలో 10,000, ఇరిగేషన్‌ శాఖ ద్వారా 30,000 మొక్కలు నాటనున్నారు. వ్యవసాయ, ఇత ర అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో 65,000, రెవె న్యూ 62,000 మొక్కలు, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ 4,26,000 ద్వారా మొక్కలు నాటనున్నారు. పొలీస్‌ శాఖ ద్వారా 14,000 మొక్కలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 45,000, పశుసంవర్థక శాఖ, మత్సశాఖ ద్వారా 10,000 మొక్క లు, ఇండస్ట్రీయల్‌ శాఖ ఆధ్వర్యంలో 5000 మొక్కలు, మైన్స్‌ ,గ్రౌండ్‌ వాటర్‌ 23,000 మొక్కలు, ఆరోగ్యశాఖ 1000 మొక్కలు, విద్యత్‌ శాఖ 2,04,000 మొక్కలు, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ 5000 మొక్కలు, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ 5000 మొక్కలు, ట్రైబల్‌ వెల్పేర్‌, ఐటీడీఏ 5000 మొక్కలు, ఇతర శాఖలు 1,78,003 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించారు. కాగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 334 గ్రామ పంచా యతీల్లో పంచాయతీకి ఒకటి చొప్పున మొత్తం 334 నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు.

- లక్ష్యంపై అనుమానాలు..

ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా ఇప్పటికి జిల్లాలో సరైన వర్షాలు కురవలేదు. ఆయాశాఖల మధ్య జిల్లాలో 51లక్షల మొక్కలు నాటాలని జిల్లా యం త్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఏటా రుతుపవనాలు రాకతో ఈ సమయానికి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసేవి. ఈసారి సరైన వానలు లేక మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికారులు కూడా వర్షాలు కురిసిన తర్వాతే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. దీంతో ఎల్‌నినో కారణంగా ప్రభు త్వం నిర్దేశించుకున్న అక్ష్యం నెరవేరుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొక్కలకు సరైన నీటి సౌకర్యం లేకుంటే వాటి సంరక్షణ ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Updated Date - Jun 17 , 2026 | 10:49 PM