Share News

మహిళా సాధికారతకు బాటలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:33 PM

గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పంచా యతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ (ధనసరి అనసూయ) సీతక్క, ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మహిళా సాధికారతకు బాటలు
రోడ్డు నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు

- రూ.17.78 కోట్ల అభివృద్ధి పనులతో పాటు సోలార్‌ యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు సీతక్క, జూపల్లి

- పాల్గొన్న ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

కొల్లాపూర్‌/ పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పంచా యతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ (ధనసరి అనసూయ) సీతక్క, ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లా పూర్‌ మండలం మాచినేనిపల్లి గ్రామ శివారులో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేయనున్న 800 కిలో వాట్ల (11 కేవీ) స ామర్థ్యం గల రెండు సోలార్‌ పవర్‌ యూనిట్ల ని ర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశా రు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ మల్లురవి, క లెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. మం త్రి సీతక్క మాట్లాడుతూ ఇం దిరా మహిళా శక్తి సంఘాల ద్వారా చేపడుతున్న ఈ సో లార్‌ ప్రాజెక్టులు మహిళల ఆ ర్ధిక స్వావలంబనకు ఎంతో తో డ్పడతాయని తెలిపారు. సోలా ర్‌ యూనిట్ల శంకుస్థాపనకు ముందు, అంకిరావుపల్లి గ్రా మంలో రూ.17.78 కోట్లతో చేపట్ట నున్న హ్యామ్‌ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రు లు, ఎంపీ, కలెక్టర్‌ శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఇందిరా మహిళాశక్తి సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రూ.15.87 కోట్ల పనులకు శంకుస్థాపన

పెద్దకొత్తపల్లి మండల నక్కలబండ స్టేజీ వద్ద రూ.15.87 కోట్లతో చేపట్టనున్న మూడు హ్యామ్‌ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృ ష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌తో కలిసి శంకు స్థాపన చేశారు. సుమారు రూ.15.87 కోట్లతో వివిధ రోడ్ల ప నులకు శంకుస్థాపన చేశారు.

చెంచు కుటుంబాల పునరావాస పనులు ప్రారంభం

నల్లమల టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్‌ కా లనీ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాచారం గ్రామంలో రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పునరావాస కాలనీనిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌లతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌, జిల్లా అటవీశాఖ అధికారి రేవత్‌చంద్ర, ఎఫ్‌డీవో చంద్రప్రకాశ్‌, సింగల్‌చర్లపల్లి పాచారం, అదనపు కలెక్టర్‌ దేవసహాయం, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వన్నోజు సత్యం, మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌రావు, మండల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దండు నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చై ర్మన్‌ నాగపూరి విష్ణు, సింగిల్‌ విండో మాజీ చై ర్మన్‌ గోపాల్‌రావు, మాజీ జడ్పీటీసీ గౌరమ్మ, న క్కలపల్లి సర్పంచ్‌ మొట్ట కుర్మయ్య, ఉపస ర్పంచ్‌ కే.రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిఽధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:33 PM