Share News

కొత్త పింఛన్ల జారీకి మార్గం సుగమం..

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:32 PM

అసెంబ్లీ ఎ న్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హా మీలను అమలు పరిచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముం దడుగు వేస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్లుగానే చేయూత పథకం కింద పింఛన్లను పెంచబో తున్నట్లు రెండేళ్ల క్రితం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.

కొత్త పింఛన్ల జారీకి మార్గం సుగమం..

వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు

-ప్రభుత్వ నిర్ణయంతో ఆశావహుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

-ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక

-జిల్లాలో 50వేల పైచిలుకు పింఛన్‌దారులు

మంచిర్యాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎ న్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హా మీలను అమలు పరిచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముం దడుగు వేస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్లుగానే చేయూత పథకం కింద పింఛన్లను పెంచబో తున్నట్లు రెండేళ్ల క్రితం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శి శు సంక్షేమ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు ప్రక్రియ పూర్తి చేశారు. అంతా సవ్యంగా సాగితే సెప్టెంబరు 1వ తేదీ నుంచే కొత్త పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం భావి స్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దర ఖాస్తుల ఆధారంగానే పింఛన్‌దారుల నివేదికను అధికా రులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆయా దరఖా స్తులతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండిం గులో ఉన్న పింఛన్‌ లిస్టు కూడా పరిగణలోనికి తీసుకో వడం ద్వారా అర్హుల జాబితా తయారు చేయాలనే ఆ దేశాలు వెలువడ్డాయి. వివిధ వర్గాలకు చెందిన అర్హుల కు చేయూత పథకం కింద పింఛన్లు పెంచబోతుండగా ప్రస్తుతం చేనేత, పైలేరియా రోగులు, వృద్ధులు, వితం తువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఎయిడ్స్‌ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పిం ఛన్లు అందజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆస రా పథకం కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 ఇవ్వగా, కాంగ్రెస్‌ హయాంలో చేయూత పథకం ద్వారా దివ్యాంగులకు రూ. 6లు, ఇతరులకు రూ. 4 వేలు అం దించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.

ముగిసిన ఆన్‌లైన్‌ ప్రక్రియ....

చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన ల బ్ధిదారుల తుది అర్హత జాబితా పూర్తిగా, ఆన్‌లైన్‌ ప్రక్రి య కూడా ముగిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించి న ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేద ప్రజల నుంచి దరఖాస్తులు ఆ హ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేసి దర ఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతం చేయూత పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో తుది జాబితాను సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగగా, ఇకనైనా నగదు బ్యాంకుల్లో జ మ అవుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. మరోవైపు ఇప్పటికైనా ప్రభుత్వం చేయూ తను అందించేందుకు సిద్ధపడుతుండటంతో ఆశావహు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 10 లక్షలకు పైగా దరఖాస్తులు...

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొ త్తం 10లక్షల 84వేల 479 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. వీటిలో 50వేల పై చిలుకు చేయూత ప థకం కోసం పింఛన్‌దారులకు చెందిన దరఖాస్తులు ఉ న్నాయి. దరఖాస్తుల్లో చేయూత పథకంలో భాగంగా కొ త్త పింఛన్లు మంజూరు చేసేందుకు అంగవైకల్యం కింద మొత్తం 6591 దరఖాస్తులను అధికారులు ఆమోదించా రు. అలాగే ఇతర విభాగాలకు చెందిన పింఛన్ల కోసం 50వేల 467 దరఖాస్తులు అర్హత సాధించాయి. చేయూ త పథకంలో భాగంగా అంగవైకల్యం కింద జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు రూ. 3 కోట్ల 95 లక్షల 46 వేలు అవసరం కాగా ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు రూ. రూ 20 కోట్ల 18 లక్షల 68 వేలు అవసరం అవుతాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సెప్టెంబరు నెల నుంచి లబ్దిదారు లకు అందజేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతర పథకాలకు సంబంధించి 10 లక్షల 27వేల 421 మందికి లబ్ది చేకూర్చాల్సి ఉంది. ఇందులో గృహిణులకు రూ. 2500 పథకం కింద 21,0614 దరఖాస్తులు ఫైనల్‌ కాగా, వంటగ్యాస్‌ కింద 21,3023, రైతులకు రూ. 15000 ప థకం కింద 93,632, కౌలు రైతులకు రూ. 15000 ప థకం కింద 10596, రూ. 12000 పథకం కింద 10,6365, 323 చదరపు గజాల ఇంటి స్థలం పథకం కింద 323, ఉద్యమకారులకు ఇంటి స్థలం పథకం కింద 2534 దరఖాస్తులు అర్హత పొందాయి.

Updated Date - Aug 28 , 2026 | 10:32 PM