Share News

పటేల్‌ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:19 PM

దేశ ఐక్య త, సమగ్రతకోసం సర్దార్‌ వల్ల భాయ్‌ పటేల్‌ చేసి సేవలు చిర స్మరనీయమని బీజేపీ నాగర్‌క ర్నూల్‌ పట్టణ అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్‌ అన్నారు. శ

పటేల్‌ సేవలు చిరస్మరణీయం
నాగర్‌కర్నూల్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ నాగర్‌కర్నూల్‌ పట్టణ అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబ రు 31 (ఆంధ్రజ్యోతి) : దేశ ఐక్య త, సమగ్రతకోసం సర్దార్‌ వల్ల భాయ్‌ పటేల్‌ చేసి సేవలు చిర స్మరనీయమని బీజేపీ నాగర్‌క ర్నూల్‌ పట్టణ అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్‌ అన్నారు. శనివారం జి ల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్‌ వల్ల భాయ్‌ పటేల్‌ జయంతిని ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండు కూ డలిలో ఏర్పాటు చేసిన వల్లభాయ్‌ పటేల్‌ చిత్ర పటానికి ప్రమోద్‌ పూల మాలలు వేసి నివాళు లు అర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న 560కి పైగా సం స్థానాలను దేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు సర్దార్‌ వల ్లభాయ్‌ పటేల్‌ అని కొనియాడారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్‌ గౌడ్‌, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌, బాబు, భీమేష్‌, లక్ష్మయ్య, పరశురా ములు, విజయ్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

ఫ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాల యంలో ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటే ల్‌ చిత్ర పటానికి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి వెంకటశెట్టి, నాయకులు బుసి రెడ్డి సుధాకర్‌రెడ్డి, సంజీవ్‌గౌడ్‌, పోల శ్రీనివా సులు, పాపిరెడ్డి, పాండు, వెంకట్‌రెడ్డి, లక్ష్మయ్య, పాండురంగయ్య, లక్ష్మీనారాయణ, సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 151వ జయంతిని శని వారం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకు న్నారు. మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్‌ సూల్క్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలములలే వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ శివ ప్రసా ద్‌, ఉపాధ్యాయుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

\

Updated Date - Oct 31 , 2026 | 11:19 PM