kumaram bheem asifabad- మొక్కజొన్న సాగుపై మక్కువ
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:47 PM
వానాకాలంలో సాగు చేసిన పంటలు అంతంత మాత్రంగా నే దిగుబడులు రావడంతో యాసంగి సీజన్‌లో మొక్కజొన్నపై రైతులు దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల్లో మొక్కజొన్న సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్ది పాటి నీటితో పండే మొక్కజొన్న సా గుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రబీ రారాజుగా పేరు పొందిన మొక్కజొన్న సాగుతో పశుగ్రాసం కొరత తీరడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులు చెబుతున్నారు
చింతలమానేపల్లి. మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సాగు చేసిన పంటలు అంతంత మాత్రంగా నే దిగుబడులు రావడంతో యాసంగి సీజన్‌లో మొక్కజొన్నపై రైతులు దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల్లో మొక్కజొన్న సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్ది పాటి నీటితో పండే మొక్కజొన్న సా గుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రబీ రారాజుగా పేరు పొందిన మొక్కజొన్న సాగుతో పశుగ్రాసం కొరత తీరడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కూడా కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని రైతులు 300 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పత్తి వరి పంటల తర్వాత, మొక్కజొన్న పంటను సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. హైబ్రిడ్‌తో పాటు, లోకల్ మక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వరి, పత్తి పంటలు పూర్తైన తర్వాత మక్క పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండలం లోని బాలాజీ అనుకోడ, చింతలమానేపల్లి, కర్జెల్లి, గూడెం, డబ్బా, రణవెల్లి, బాబాపూర్ తదితర గ్రామా ల్లో అధికంగా పంట సాగవుతోంది.
- 60 నుంచి 80 రోజులకే..
మొక్కజొన్న పంట కేవలం 60 నుంచి 80 రోజుల కాల వ్యవధిలో చేతికొస్తుంది. దీనిక పెట్టుబడి కూడా తక్కువే అని చెప్పవచ్చు. ఒకటి, రెండు సార్లు ఎరు వులు వేసి, సమయానికి నీళ్లు పడితే సరిపోతుంది. ఈ పంట నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. పంట దిగుబడి కూడా ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పంటతో పశుగ్రాసం కొరత కూడా తీరనుంది. యాసంగిలో బావుల్లో నీరు అధికంగా ఉండడంతో ఆరుతడి పంటైన మొక్కజొన్న సాగు చేస్తున్నారు. దీంతో పంట చేతికందిన తర్వాత మొక్కజొన్న కర్రలు పశుగ్రాసం ఉపయోగపడతున్నా యి. ప్రభుత్వం ఈ పంటకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
రైతులకు లాభసాటే..
- కేర్కర్ మధుకర్, రైతు
మొక్కజొన్న పంట లాభ సాటిగా ఉంటుంది. పొ లంలో వరి పంట పూర్తైన వెంటనే ఏటా మొక్కజొన్న పంట వేస్తాం. సరియైన సమయంలో నీటిని అందిం చాలి. కొంత మేర రసాయన ఎరువులను, మందుల ను వేయాలి. పశుగ్రాసం కూడా వీటి కర్రలు ఉపయో గపడుతాయి. ఆర్థికంగా లాభం చేకూరుతుంది.
ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి..:
- ఎల్కరి దిలీప్, రైతు
మొక్కజొన్న పంటకు సరైన మద్దతు ధర లేక పోవడంతో రైతులకు నష్టం కలుతుంది. ప్రభుత్వం స్పందించి పంటకు మద్దతు ధర కల్పించాలి. ఈ ఏడాది రెండు ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నాను. ఆర్థికంగా లాభం చేకూరడంతో పాటు, పశువులకు గ్రాసంగా రెండు విధాలుగా ఉపయోగపడుతోంది.