Share News

పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:37 PM

నాగర్‌కర్నూల్‌ పార్లమెం టు నియోజవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ, జి ల్లా, పార్లమెంటు స్థాయి కమిటీలను త్వరి తగతిన పూర్తి చేయాలని ఆపార్టీ పార్లమెం టు అధికారి ప్రతినిధి కొప్పుల రమేష్‌ కోరా రు.

పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోత్స్నకు వినతిపత్రం అందజేస్తున్న కొప్పుల రమేష్‌

- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నకు నాయకుల వినతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ పార్లమెం టు నియోజవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ, జి ల్లా, పార్లమెంటు స్థాయి కమిటీలను త్వరి తగతిన పూర్తి చేయాలని ఆపార్టీ పార్లమెం టు అధికారి ప్రతినిధి కొప్పుల రమేష్‌ కోరా రు. ఈ మేరకు హైదరాబాదులో టీడీపీ జా తీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నను మర్యాదపూ ర్వకంగా కలిసిన జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాగర్‌క ర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీ డీపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌, కార్యక ర్తల మద్దతు ఉందని తెలిపారు. కమిటీల ఏ ర్పాటు ద్వారా నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు పార్టీని క్షేత్ర స్థా యిలో మరింత బలోపేతం చేయవచ్చని ఆ శాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వెం కటరమణ, నాయకులు శ్రీనివాసులు, కాశ న్న, సుధాకర్‌, చంద్రయ్యయాదవ్‌, సత్యనారా యణ, కుర్మయ్య, శంకర్‌, బాలరాజుపాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 11:37 PM