Share News

kumaram bheem asifabad- పర్సువాడ అభివృద్ధికి దూరం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:42 PM

లకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారు తున్న కెరమెరి మండలంలోని పర్సువాడ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలవుతున్నా మరుమూల గిరిజన గ్రామమైన పర్సువాడకు మాత్రం కనీస మౌలిక వసతులు అందటం లేదు. రహదారి, తాగునీరు, విద్య, డ్రైనేజీ, పక్కా ఇళ్ల వంటి సమస్యలతో గ్రామస్థులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కెరమరి మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సువాడ ఉంది.

kumaram bheem asifabad-  పర్సువాడ అభివృద్ధికి దూరం
లోగో

- అటవీ అనుమతుల జాప్యంతో నిలిచిన రహదారి

- తాతాక్కలిక షెడ్డులోనే పాఠశాల

- తడకల ఇళ్లలోనే గిరిజనుల జీవనం

కెరమెరి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారు తున్న కెరమెరి మండలంలోని పర్సువాడ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలవుతున్నా మరుమూల గిరిజన గ్రామమైన పర్సువాడకు మాత్రం కనీస మౌలిక వసతులు అందటం లేదు. రహదారి, తాగునీరు, విద్య, డ్రైనేజీ, పక్కా ఇళ్ల వంటి సమస్యలతో గ్రామస్థులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కెరమరి మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సువాడ ఉంది. కెరమెరి నుంచి కెలిబి గ్రామం వరకు రహదారి సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పర్సువాడకు సుమారు మూడు నుంచి నాలుగు కిలో మీటర్ల మేర ఎతైన గుట్టలు, భారీ రాళ్లు, మధ్య కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. భారీ రాళ్ల మఽధ్య కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షా కాలంల ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారడంతో గ్రామానికి రాక పోకలు దాదాపు నిలిచి పోతున్నాయి.

కెలిబి వరకు..

కెలిబి వరకు ఉన్న ప్రాంతం రెవెన్యూ పరిధిలో ఉండగా, అక్కడి నుంచి పర్సువాడ వరకు అటవీ శాఖ పరిఽధిలోకి వస్తోంది. దీంతో రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరమతున్నాయి. అనుమ తుల ప్రక్రియలో జాప్యం కారణంగా రహదా రి నిర్మాణం ముందుకు సాగడం లేదు. రహదారి సమస్య పరిష్కారం పూర్తిగా నిలిచి పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు అధి కారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇంత వరకు శాశ్వతం మార్గం దొరక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు దశాబ్దాల క్రితం నిర్మించుకున్న పాత బావి, మిషన్‌ భగీరథ నీటిపైనే ప్రధానంగా ఆధారప డుతున్నారు. వేసవిలో నీటి ఇబ్బందులు మరింత తీవ్రతమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామానికి సరైన రహదారి లేక పోవడంతో నీటి వనరుల అభివృద్ధి ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా కష్టంగా మారింది. గ్రామంలో శాశ్వత పాఠశాలకు పక్కా భవనం నిర్మించలేదు. దీంతో గతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్డులోనే పాఠశాల కొనసాగుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇక్కడే విద్యాబోధన జరుగుతోంది. వర్షాకాలంలో షెడ్డులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. గిరిజన పిల్లలకు మెరుగైన విద్య అందించాలంటే పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

అధ్వాన రోడ్లు..

గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారుతు న్నాయి. అంతర్గత సీసీ రోడ్డు లేక పోవడంతో వర్షాకాలంలో పర్సువాడ మొత్తం బురదమ యంగా మారుతోంది. రహదారులపై అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేక పోవగంతోనే మురుగు నీరు ఇళ్ల మధ్యనే నిలిచి పోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న గ్రామస్థుల జీవన పరిస్థితుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కుటుంబాలు ఇప్పటికీ కర్రలు, తడ కలతో నిర్మించుకున్న ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభు త్వ పథకాల ద్వారా మంజూరు వచ్చిన రహదారి లేక నిర్మాణ సామగ్రి గ్రామానికి తరలించేక పోతున్నారు. తొలివిడతలో గ్రామానికి నాలుగు ఇందిరమ్మ ఇళ్లు మంజూర య్యాయి. కానీ రహదారి సౌకర్యం లేక ఇసుక, సిమెంటు, ఇటుకలు ఇతర నిర్మాణ సామాగ్రిని గ్రామానికి తరలించడం సాధ్యం కాక పోవడంతో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇల్లు మంజూరైనా ప్రయోజనం లేకుండా పో యిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటి కైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిం చి పర్సువాడకు పక్కా రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:42 PM