kumaram bheem asifabad- పర్సువాడ.. అభివృద్ధికి దూరం
ABN , Publish Date - Aug 09 , 2026 | 10:29 PM
పాలకులు మారుతున్నా కెరమెరి మండలంలోని పర్సువాడ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నప్పటికీ గిరి గ్రామాలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. కెరమెరి మండలం పర్సువా డలో అనేక సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నారు.పర్సువాడ మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- పట్టించుకోని అధికారులు, నాయకులు
కెరమెరి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పాలకులు మారుతున్నా కెరమెరి మండలంలోని పర్సువాడ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నప్పటికీ గిరి గ్రామాలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. కెరమెరి మండలం పర్సువా డలో అనేక సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నారు.పర్సువాడ మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి ఏడుమీటర్ల వరకు మాత్రమే తారు రోడ్డు ఉంది. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా బండరాళ్లు, ఎతైన గుట్టలు, గుంతలతో నిండిన దారిలోనే ప్రయాణించా ల్సిన దుస్థితి దాపురించింది. వర్షాకాలంలో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారి గ్రామానికి రాక పోకలు దాదాపు నిలిచి పోతున్నాయి. ఏటా ఈ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. కెరమెరి నుంచి కెలి బీ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పర్సువాడకు చేరుకోవాలంటే మూడు కిలోమీటర్ల ఎత్తైన గుట్టులు, భారీ రాళ్ల మధ్య కాలినడకనే దిక్కవుతోంది. ఈ దారిలో నడవడం ఇబ్బం దికరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రికి తరలించాలంటే పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి ఉంది.
- 35 కుటుంబాలు
ఈ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా, ఇందులో 125 మందికిపైగా లంబాడా గిరిజనులు నివసిస్తున్నారు. గ్రామ సమీపంలో ఆదిమ గిరిజన తెగలకు చెందిన కుటుంబా లు కూడా ఉన్నాయి. గ్రామస్థులు దశాబ్దాల క్రితం నిర్మించుకున్న పురాతన బావి, మిషన్ భగీరథ నీటిపైనే ఆధార పడుతున్నారు. కెలిబి గ్రామం వరకు రెవెన్యూ పరిధిలో ఉండగా, అక్కడది నుంచి పర్సువాడ వరకు అటవీ శాఖ పరిధిలోకి వస్తోంది. దీంతో రోడ్డు నిర్మా ణానికి అటవీశాఖ అనుమతులు అవసర మతున్నాయి. అనుమతుల జాప్యంతో రోడ్డు నిర్మాణం ముందకు సాగక పోవడంతో గ్రామ అభివృద్ధి పూర్తిగా నిలిచి పోయింది. గ్రామం లో శాశ్వత పాఠశాల భవనం లేక పోవడంతో గతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులోనే బడి కొనసాగుతోంది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు రేకుల షెడ్డులోనే విద్యాభోధన చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక పోవటంతో మురుగు నీరు ఇళ్ల మధ్యనే ఉంటుంది. సీసీ రోడ్లు లేక వర్షకాలంలో గ్రామం మొత్తం బురదమయంగా మారి ప్రజలు అడుగు పెట్టలేని పరిస్థితిలో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్న కూడా ప్రజలు జీవితం ఇప్పటికీ ఏ మాత్రం మారటం లేదు. చాలా కుటుం బాలు కర్రలు, తడకలతోనే నిర్మించుకున్న ఇళ్లలోనే నివరిస్తున్నారు. తొలి విడతలో నాలుగు ఇందరిమ్మ ఇళ్లు మంజూరైనా రోడ్డు సౌకర్యం లేక నిర్మాణ సామగ్రి గ్రామానికి తరలించలేక పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో అత్యవసర సమస్యలు పరిష్క రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి..
- జలపతి, పర్సువాడ
పర్సువాడలో నెలకొన్న సమస్యలను అధికా రులు పరిష్కరించాలి. గ్రామానికి వెళ్లేందుకు పూర్తి రహదారి సౌకర్యం లేదు. అత్యవసర మొస్తే దేవుడిపై భారం వేసి కాలం గడుపు తున్నాం. గర్భిణులను తరలించాలంటే కూడా కష్టంగా ఉంటుంది. గతంలో జరిగిన సమావే శాల్లో కూడా ఈ సమస్యను అధికారులకు వివరించాం. ఇంత వరకు పరిష్కారం కాలే దు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి సమస్యలు పరిష్కరించాలి.