Share News

Khammam District: కుమారుల మృతిని తట్టుకోలేక..20 రోజుల్లో దంపతుల ఆత్మహత్య

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:36 AM

తొమ్మిది నెలల క్రితం గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కవల కుమారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు మనోవేదనతో 20 రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు.

Khammam District: కుమారుల మృతిని తట్టుకోలేక..20 రోజుల్లో దంపతుల ఆత్మహత్య

  • ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో విషాదం

తల్లాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది నెలల క్రితం గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కవల కుమారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు మనోవేదనతో 20 రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో జరిగింది. కూలీలుగా పనిచేసే గుత్తికొండ వినోద్‌కుమార్‌ (పండు), రేవతి దంపతులకు తరుణ్‌, వరుణ్‌ కవల కుమారులు. వారు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. గత ఏప్రిల్‌ 28న ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. వినోద్‌కుమార్‌ అతడి కుమారులు వరుణ్‌, తరుణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి కోలుకోగా, హైదరాబాద్‌ నిలోఫర్‌, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 29న తరుణ్‌, 30న వరుణ్‌ మృతి చెందారు. కుమారుల మరణంతో వినోద్‌కుమార్‌, రేవతి దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రేవతి డిసెంబరు 27న ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందింది. భార్య, పిల్లలను కోల్పోయి, ఒంటరి తనాన్ని భరించలేక ఈ నెల 7న వినోద్‌కుమార్‌ (36) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందా డు. ఇలా ఓ ప్రమాదం కారణంగా 9నెలల వ్యవధిలో కుటుం బం బలికావడం మిట్టపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Updated Date - Jan 17 , 2026 | 06:37 AM