పిల్లల చదువుపై తల్లిదండ్రులూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - May 14 , 2026 | 11:34 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రా ణించాలంటే ఉపాధ్యాయలతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించా లని డీఈవో రమేశ్ కుమార్ సూచిం చారు.
- డీఈవో రమేశ్ కుమార్
బిజినేపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రా ణించాలంటే ఉపాధ్యాయలతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించా లని డీఈవో రమేశ్ కుమార్ సూచిం చారు. మండల కేంద్రంలోని గాంధీన గర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా తల్లిదండ్రులతో ప్రత్యేక సమా వేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల ప్రగ తిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు. విద్యా అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమి తం కాకుండా సామాజిక బాధ్యతలపై, సా మాజిక విలువలపై అవగాహన కల్గించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యాభ్యాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో ఎం ఈవో తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.