టికెటున్నా.. పాపికొండల యాత్ర సాగలే!
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:43 AM
వరుస సెలవుల నేపథ్యంలో పాపికొండల యాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దీంతో అన ధికారిక ఏజెంట్లు బోట్ల స్థాయికి మించి విచ్చలవిడిగా టికెట్లు విక్రయించడంతో..
ఏజెంట్లు విచ్చలవిడిగా టికెట్లు విక్రయించడంతో సమస్య
వెనక్కి వచ్చిన సుమారు 300 మంది పర్యాటకులు
భద్రాచలం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో పాపికొండల యాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దీంతో అన ధికారిక ఏజెంట్లు బోట్ల స్థాయికి మించి విచ్చలవిడిగా టికెట్లు విక్రయించడంతో.. యాత్రకు వెళ్లిన పర్యాటకులు చివరికి పాపికొండలు చూడకుండానే వెనుదిరుగాల్సి వచ్చింది. భద్రాది కొత్తగూడెం జిల్లా నుంచి ప్రారంభమయ్యే పాపికొండలు, పేరంటాలపల్లి విహార యాత్రకు ఆదివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. దీంతో అన ధికారిక ఏజెంట్లు విచ్చలవిడిగా టికెట్లను విక్రయించారు. ఈక్రమంలోనే ఏపీలోని వరరామచంద్రాపురం మండలం పోచవరంలో ఉన్న బోటింగ్ పాయింట్ వరకు వెళ్లిన పర్యాటకులు.. లాంచీలు లేకపోవడంతో అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వారు చేతులెత్తేయడంతో.. ఫోన్ సిగ్నల్స్ లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక పర్యాటకులు నానా ఇబ్బందులు పడ్డారు. 300మంది పర్యాటకులు తిరిగి భద్రాచలం చేరుకుని టికెట్లు జారీ చేసిన అనధికార ఏజెంట్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులపర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పర్యాటకులు వాపోయారు.