Share News

పాపికొండల విహారయాత్ర మళ్లీ షురూ!

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:55 AM

భద్రాచలం నుంచి ఏపీలోని పాపికొండలు పేరంటాలపల్లి పర్యాటక ప్రాంత సందర్శనకు మార్గం సుగమమైంది.

పాపికొండల విహారయాత్ర మళ్లీ షురూ!
papikondalu

భద్రాచలం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం నుంచి ఏపీలోని పాపికొండలు పేరంటాలపల్లి పర్యాటక ప్రాంత సందర్శనకు మార్గం సుగమమైంది. పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్‌ నుంచి బోట్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు బోటు నిర్వాహకులు వెల్లడించారు. గురువారం చింతూరు ఐటీడీఏ పీవో చిట్టపల్లి నరేంద్రపడాల్‌ను బోటు నిర్వాహకులు కలిశారు. ఈ సందర్భంగా పాపికొండలు పేరంటాలపల్లి విహారయాత్రను పోచారం నుంచి పునరుద్ధరించేందుకు అనుమతించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో ఆయన సానుకూలంగా స్పందించినట్టు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి పాపికొండలు పేరంటాలపల్లి విహారయాత్ర పునఃప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 03:55 AM