పాపన్నగౌడ్ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:05 PM
సర్దార్ పాపన్న గౌడ్ జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వ హించిన పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : సర్దార్ పాపన్న గౌడ్ జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వ హించిన పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం ద్వారా ఆత్మ విశ్వాసం, సమిష్టి కృషి ఉంటే మంచి ఫలితాలను సాధించ వచ్చనే సందేశం తెలుస్తుందన్నారు. పాపన్నగౌడ్ ఆశయాల ను స్ఫూర్తిగా తీసు కుని సమాజ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలె క్టర్ చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహ్మద్ విలాయత్ అలీ, వెనకబడిన తరగ తుల అభివృద్ధి అదికారి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపా లన అధికారి వ్రీనివాసరావుదేశ్‌పాండే పాల్గొన్నారు.
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలో బీసీ సమాజ్ ఆ ధ్వర్యంలో సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. బీసీ నాయకులు ఆయన చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరేడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కుల గణనపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాల న్నారు. 2011లో నిర్వహించిన సామాజిక కుల సర్వేలో కుల వివరాలు నమో దుకు ఓపెన్ విధానం కారణంగా అనేక ఉపకులాలు, ఇంటి పేర్లు, ప్రాంతీయ పేర్లు వేర్వేరుగా నమోదయ్యాయన్నారు. నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, రంగు రాజేశం, ఎండీ లతీఫ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.