kumaram bheem asifabad- బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్నగౌడ్
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:57 PM
బహుజన ఆత్మగౌరవానికి సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీక అని, ఆయన జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిర్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, గౌడ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు
ఆసిఫాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బహుజన ఆత్మగౌరవానికి సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీక అని, ఆయన జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిర్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, గౌడ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి అప్పటి మొగల్ పాలకుల అరాచకాలను ఎదిరించి గోలుగోండ పాలించిన మహనీయుడు సర్వాయి పాపన్నగౌడ్ అని తెలిపారు. పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో వెనుకబడి తరగతుల సంక్షేమ అధికారి నదీం, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, గౌడ సంఘాల ప్రతినిధులు బాలేశ్వర్ గౌడ్, కేసరి అంజనేయులు గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, మార్క శంకర్ గౌడ్, మహిళ సంఘాల ప్రతినిధులు నీరజ గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలో మంగళవారం సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సుదాకర్‌గౌడ్, రవీందర్‌గౌడ్, నరేందర్‌గౌడ్, కార్తీక్‌గౌడ్, దిలీప్‌గౌడ్, రమేష్‌గౌడ్, ఉపసర్పంచ్ ఆదర్శ్, నాయకులు సతీష్, సామల తిరుపతి, తుమ్ముల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు కార్యక్రమంలో సర్పంచు మడావి రాజేష్, మోకు దెబ్బ రాష్ట్ర నాయకులు అనిల్ గౌడ్, మార్క శంకర్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బొమ్మగొని శంకర్ గౌడ్, ఆశోక్ గౌడ్, రంగు వైకుంఠం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంఽధ్రజ్యోతి): మండలం హత్ని గ్రామంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకుడు రాజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఉప్పుల ప్రమోద్, సర్పంచు నక్క శంకర్ మాట్లాడుతూ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహనీ వర్గాల కోసం ఎనలేని సేవలు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఉప సర్పంచి గోపాల్, ఆరె సంఘం మండల అధ్యక్షుడు ఫణిందర్‌గౌడ్, నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణగౌడ్, రవీందర్‌గౌడ్, చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.