Share News

ఆడపిల్ల పుడితే రూ. 5 వేల నజరానా

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:13 AM

ఊర్లో ఎవరి ఇంటనైనా ఆడపిల్ల పుడితే నజరానాగా రూ.5వేలు ఇస్తానని గ్రామసభ సాక్షిగా ఆ మహిళా సర్పంచ్‌ ప్రకటించారు.

ఆడపిల్ల పుడితే రూ. 5 వేల నజరానా

  • హనుమకొండ జిల్లా పెంచికపేట మహిళా సర్పంచ్‌ హామీ

  • ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకే

ఎల్కతుర్తి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఊర్లో ఎవరి ఇంటనైనా ఆడపిల్ల పుడితే నజరానాగా రూ.5వేలు ఇస్తానని గ్రామసభ సాక్షిగా ఆ మహిళా సర్పంచ్‌ ప్రకటించారు. ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా పదవిలో ఉన్నంతకాలం ఈ సాయాన్ని కొనసాగిస్తానని ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ సర్పంచ్‌ ముప్పు శైలజా శ్రీనివాస్‌ చాటుకున్న ఆదర్శమిది. మంగళవారం ఆమె గ్రామ సభ నిర్వహించారు. గ్రామానికి చెందిన చందా బాలరాజు- స్రవంతి దంపతులకు ఆడబిడ్డ జన్మించగా వారికి సర్పంచ్‌ రూ. 5 వేల నగదును అందజేశారు.

Updated Date - Jan 28 , 2026 | 04:13 AM