Share News

పంచాయతీలే నయం...!

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:41 PM

ఆస్తిపన్ను వసూళ్లలో గ్రామ పంచాయతీలు ముందంజలో ఉన్నా యి. మరో నెల రోజుల్లో ఆస్తిపన్ను చెల్లింపు గడువు ము గియనుంది. ఇప్పటి వరకు అయిన వసూళ్లలో మున్సి పాలిటీలతో పోల్చితే పంచాయతీలు దాదాపుగా లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్‌ కా ర్పొరేషన్‌తోపాటు మరో ఐదు మున్సిపాలిటీలు, 16 మం డలాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫి బ్రవరి నెలాఖరు వరకు మున్సిపాలిటీల్లో 47.16 శా తం వసూళ్లు నమోదుకాగా గ్రామ పంచాయతీల్లో 75 శాతం వసూళ్లు నమోదయ్యాయి.

పంచాయతీలే నయం...!

ఆస్తిపన్ను వసూళ్లలో పల్లెల హవా

-మార్చి నెలాఖరుతో ముగియనున్న గడువు

-చివరి స్థానంలో మంచిర్యాల కార్పొరేషన్‌

-గ్రామ పంచాయితీల్లో 75 శాతం వసూళ్లు

-మున్సిపాలిటీల్లో 47 శాతానికి పరిమితం

మంచిర్యాల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను వసూళ్లలో గ్రామ పంచాయతీలు ముందంజలో ఉన్నా యి. మరో నెల రోజుల్లో ఆస్తిపన్ను చెల్లింపు గడువు ము గియనుంది. ఇప్పటి వరకు అయిన వసూళ్లలో మున్సి పాలిటీలతో పోల్చితే పంచాయతీలు దాదాపుగా లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్‌ కా ర్పొరేషన్‌తోపాటు మరో ఐదు మున్సిపాలిటీలు, 16 మం డలాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫి బ్రవరి నెలాఖరు వరకు మున్సిపాలిటీల్లో 47.16 శా తం వసూళ్లు నమోదుకాగా గ్రామ పంచాయతీల్లో 75 శాతం వసూళ్లు నమోదయ్యాయి. మున్సిపాలిటీలకు సంబంధిం చి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 46 కోట్ల 23 ల క్షల ఆస్తిపన్ను డిమాండ్‌ ఉండగా, ఇందులో ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేవలం రూ. 18 కోట్ల 44 లక్షలు మా త్రమే వసూలైంది. మరో రూ.27 కోట్ల 79 లక్షలు వసూ లు కావల్సి ఉంది. అలాగే గ్రామ పంచాయతీలకు సం బంధించి ఆస్తిపన్ను మొత్తం డిమాండ్‌ రూ. 6 కోట్ల 56 లక్షల 16 వేల 489 ఉండగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 4కోట్ల26 లక్షల, 62వేల 631 వసూలు కాగా మరో రూ. 2 కోట్ల 29 లక్షల 53వేల 858 వసూలు కావలసి ఉంది. మునిసిపల్‌ ఎన్నికల పుణ్యమా అని నో డ్యూస్‌ స ర్టిఫికేట్ల కోసం అభ్యర్థులు పెద్ద మొత్తంలో పన్ను చెల్లిం చడంతో ఆ మాత్రం వసూళ్లు నమోదయ్యాయి. లేని పక్షంలో ఈ ఆర్థిక సంవత్సరం మునిసిపాలిటీలలో నిధు ల కొరత ఏర్పడి ఉండేది.

డివిజన్ల వారీగా ఇలా..

జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో మొత్తం 16 మండలాల్లో 306 గ్రామ పంచాయ తీలు ఉన్నాయి. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో మొత్తం డిమాండ్‌ రూ. 2 కోట్ల 30 లక్షల 48వేల 780 ఉండగా అందులో ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ. కోటి 79 లక్షల 23వేల 009 వసూలు కాగా మరో రూ. 51 లక్షల 25వేల 771 వసూలు కావాల్సి ఉం ది. మంచిర్యాల డివిజన్‌ పరిధిలో రూ. 4 కోట్ల 25 లక్షల 67వేల 709 డిమాండ్‌ ఉండగా అందులో రూ. 2 కోట్ల 47 లక్షల 39వేల 622 వసూలు కాగా, మరో రూ. కోటి 78లక్షల 28వేల 087 వసూలు కావాల్సి ఉంది.

మండలాల వారీగా ఇలా...

మండలం డిమాండ్‌ వసూలు శాతం

జైపూర్‌ 56,69,919 40,72,938 72

కన్నెపల్లి 11,15,507 8,08,998 73

భీమారం 16,75,031 13,89,465 83

కోటపల్లి 31,91,603 24,25,379 76

లక్షెట్టిపేట 38,96,850 31,86,024 94

భీమిని 10,70,022 8,67,767 81

హాజీపూర్‌ 44,48,776 30,89,898 69

కాసిపేట 68,48,943 63,80,518 93

బెల్లంపల్లి 45,97,362 31,91,446 69

దండేపల్లి 58,00,930 42,43,181 73

నెన్నెల 16,32,260 12,46,885 76

వేమనపల్లి 10,24,015 7,82,748 76

చెన్నూరు 43,31,752 31,24,421 72

మందమర్రి 33,89,513 25,11,854 74

తాండూరు 67,60,671 46,44,657 69

జన్నారం 1,01,63,335 69,64,622 69

మున్సిపాలిటీల్లో వసూళ్లు ఇలా...

మున్సిపాలిటీ డిమాండ్‌ (కోట్లు) వసూలు (కోట్లు) శాతం

మంచిర్యాల 30.25 10.92 36

చెన్నూరు 3.01 1.09 36

మందమర్రి 2.20 1.40 64

క్యాతన్‌పల్లి 4.42 2.24 51

బెల్లంపల్లి 4.45 1.69 38

లక్షెట్టిపేట 1.90 1.10 58

చివరి స్థానంలో మంచిర్యాల కార్పొరేషన్‌...

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెన్నూరు మునిసిపాలిటీతో స మానంగా ఆస్తిపన్ను వసూళ్లలో చివరి స్థానంతో సరిపె ట్టుకుంది. ఆస్తి పన్ను వసూళ్లపై సిబ్బంది నిర్లక్ష్యం కార ణంగా డిమాండ్‌ మేరకు పన్ను వసూలు కాలేదని తెలు స్తోంది. పాలక వర్గం లేని మందమర్రి మున్సిపాలిటీ పన్ను వసూళ్లలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గతంలో ప్రతి సంవత్సరం మార్చి మాసానికి రెండు నెల ల ముందుగానే మున్సిపాలిటీల నుంచి ప్రజలకు ఆస్తిప న్ను డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యేవి. వాహనాల ద్వా రా పన్ను వసూళ్లకు వసూళ్లకు విస్తృత ప్రచారం చేసేవా రు. ప్రస్తుతం ఎక్కడ కూడా నోటీసులు జారీకాకపోగా, ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో పన్ను వ సూళ్లలో కార్పొరేషన్‌ వెనుకబడినట్లు ప్రచారం జరగు తోంది. ప్రభుత్వం ఓ వైపు ఆస్తిపన్ను చెల్లించాలని చెబు తున్నా మున్సిపాలిటీలు డిమాండ్‌ నోటీసులు జారీ చేయ కపోవడంతో ఈ సంవత్సరం వసూళ్ల లక్ష్యం నెరవేరలేదు.

Updated Date - Feb 28 , 2026 | 11:41 PM