Share News

పంచాయతీ నిధులు పక్కదారి...!

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:57 PM

గ్రామ పం చాయతీ నిధులు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిన సంఘటన భీమారం గ్రామ పంచాయతీలో చోటు చే సుకుంది.

పంచాయతీ నిధులు పక్కదారి...!
మంచిర్యాల జిల్లా భీమారం గ్రామ పంచాయతీ కార్యాలయం

-ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లలోకి అక్రమంగా మళ్లింపు

-నిధుల దుర్వినియోగంలో సర్పంచ్‌ భర్త ప్రమేయం..?

-భీమారం జీపీలో రూ. 23 లక్షలకు తేలని లెక్కలు

-విచారణ పేరుతో కాలం వెళ్లదీస్తున్న అధికారులు

మంచిర్యాల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ పం చాయతీ నిధులు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిన సంఘటన భీమారం గ్రామ పంచాయతీలో చోటు చే సుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం, గ్రామ పంచాయతీ నిధులు రూ. 23 లక్షలు ప్రైవేటు వ్యక్తుల బ్యాంక్‌ ఖాతాల్లోకి మళ్లడం స్థానికంగా కలకలం సృష్టిం చింది. వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులకు సంబంధించి ఆయా ఫర్మ్‌ల పేరిట అధికారికంగా స ర్పంచ్‌, ఉప సర్పంచ్‌ సంయుక్తంగా చెక్‌లు జారీ చే యాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కొందరు ప్రైవేటు వ్యక్తుల పేరిట నగదు బ్యాంకు అకౌంట్లలో జమ చే యడం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా చేసిన పనులకు చెల్లించాల్సిన మొత్తం కంటే అధిక మొత్తం లో ఖర్చులు చూపారనే అపవాదు ఉంది. పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లోపే అంటే జ నవరి నుంచి మార్చి వరకు ఏకంగా రూ. 23 లక్షల పై చిలుకు నిధులు ఖర్చు చేసినట్లు చూపగా, నిధులు ప క్కదారి పట్టాయని గ్రామస్థులు సందేహాలు లేవనెత్తా రు. చేసిన ఖర్చులపై వివరణ ఇవ్వాలని కోరగా, స్పం దన లేకపోవడంతో గ్రామస్థులు పలువురు ప్రజా ఫి ర్యాదుల విభాగంలో రెండు నెలల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పరిధిలో సానిటేషన్‌, తాగునీటి సరఫరా, ఇంధనం, మరమ్మతుల పేరుతో రూ. 23,28,674లను గ్రామ సర్పంచ్‌ విజయలక్ష్మి, ఉప సర్పంచ్‌ సత్తమ్మలు సంయుక్తంగా కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేశారని, ఆ నిధు లలో పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయని పే ర్కొంటూ గ్రామస్థులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామ పంచాయతీ నిధులు సొం తానికి వాడుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

అనర్హుల పేరిట నిధుల బదిలీ...!

గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్‌, ఉప స ర్పంచ్‌లు మొత్తం 13 మంది పేరిట చెక్కులు జారీ చేయగా, వారిలో అధికభాగం వారి అనుచరుల పేరిటే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా చే సిన పనులకు సంబంధించి రికార్డుల ప్రకారం సంబం ధిత కాంట్రాక్టర్లు, ఫర్మ్‌ల పేరిట చెక్కులు ఇవ్వాల్సి ఉం డగా, కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల పేరిట అక్ర మంగా జారీ కాగా, వారి బ్యాంకుల్లో నేరుగా జమ కా వడం వివాదానికి కారణమైంది. నిధులు బదిలీ జరిగింది ఇలా....

01. ఇంధనం బిల్లులకు....

సూర్య ప్రకాష్‌ పేరిట (ప్రైవేటు వ్యక్తి) రూ. 90,000 బదిలీ కాగా చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/19, తేది: 31-03-2026

02. తాగునీటి ఖర్చుకు....

గోస్కుల సహజ (ఈమె పంచాయతీలో పనిచేసే మల్టీ పర్పస్‌ వర్కర్‌ భరత్‌ భార్య, గృహిణి) పేరిట రూ. 81,500, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/23, తేది: 31-03-2026

03. సానిటేషన్‌ ఖర్చులకు.....

గోస్కుల సహజ పేరిట రూ. 85,000, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/20, తేది: 31-03-2026

04. కార్మికుల వేతనాలు చెల్లించేందుకు....

గోస్కుల సహజ పేరిట రూ. 62,000, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/12, తేది: 24-03-2026

05. డ్రింకింగ్‌ వాటర్‌ బిల్లులకు....

గోస్కుల సహజ పేరిట రూ. 41,650, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/15, తేది: 31-03-2026

06. మెయింటనెన్స్‌ డ్రైన్‌ పేరిట....

సుధారాణి ఎంటర్‌ ప్రైజెస్‌ పేరిట రూ. 2,54,100, చెక్‌ నెంబర్‌ /2025-26/పీ/18, తేది: 31-03-2026 (ఇక్కడ అనవసరపు ఖర్చులు చూపినట్లు తెలుస్తోంది).

07. స్ట్రీట్‌ లైట్స్‌ పేరిట....

ఓం ఎంటర్‌ ప్రైజెస్‌ పేరిట రూ. 4,42,052, చెక్‌ నెంబర్‌/2025-26/పీ/21, తేది: 31-03-2026 (ఇక్కడ కూడా ఖర్చులు అధనంగా రాశారనే అపవాదు ఉంది).

08. సానిటరీ, డ్రింకింగ్‌ వాటర్‌....

ఉస్కమల్ల పున్నంచంద్‌ (సర్పంచ్‌ భర్త) పేరిట రూ. 2,90,650, చెక్‌ నెంబర్‌/2025-26/పీ/17, తేది: 31-03-2026

09. జీపీ ఆఫీస్‌ రిపేరింగ్‌ కోసం...

ఉస్కమల్ల శ్రీనివాస్‌ (సర్పంచ్‌ బావ) పేరిట రూ. 1,60,638, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/14, తేది: 24-03-2026

10. గ్రౌండ్‌ అభివృద్ధి కోసం....

ఉస్కమల్ల శ్రీనివాస్‌ (సర్పంచ్‌ బావ) పేరిట రూ. 3,28,962, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/16, తేది: 31-03-2026

11. సానిటేషన్‌ ఖర్చుల కింద....

అనపురం సుకన్య (ఈమె భర్త కృష్ణ పంచాయతీలో మల్టీ పర్పస్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు) పేరిట రూ. 53,700, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/13, తేది: 24-03-2026

12. డ్రింకింగ్‌ వాటర్‌, సానిటేషన్‌, ట్రాక్టర్‌ రిపేర్‌ కింద....

అనపురం సుకన్య పేరిట రూ. 2,19,222, చెక్‌ నెం బర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/9, తేది: 12-02-2026

13. సానిటేషన్‌ ఖర్చుల కింద....

పోగుల మల్లేష్‌ (స్థానికంగా లేడీస్‌ ఎంపోరియం, సానిటేషన్‌ సామగ్రి పెద్దగా ఉండదు) పేరిట రూ. 1,50,000, చెక్‌ నెంబర్‌: ఎక్స్‌వీఎఫ్‌సీ/2025-26/పీ/22, తేది: 31-03-2026 జారీ చేశారు.

విచారణ పేరుతో కాలయాపన....

భీమారం పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గ్రామస్థులు పలువురు ఈ ఏడాది ఏప్రిల్‌ 13న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌ జిల్లా పంచాయతీ అధికారిని పూర్తిస్థాయిలో విచా రణ జరపాలని ఆదేశించారు. అయితే రెండు నెలలు గ డుస్తున్నా ఇంతవరకు విచారణ చేపట్టకపోగా, కాల యాపన చేస్తుండటం గమనార్హం. పంచాయతీ పాలక వర్గానికి ఉన్న రాజకీయ అండదండల కారణంగానే వి చారణ జరుపకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా పంచా యతీ అధికారి వెంకటేశ్వర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివ రణ కోరగా, డీఎల్‌పీవోను విచారణ జరపాల్సిందిగా ఆ దేశించినట్లు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి, వాస్తవా లను ప్రజల ముందు ఉంచాలనే డిమాండ్‌లు గ్రామ స్థుల నుంచి వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 26 , 2026 | 10:57 PM