పంచాయతీ ఎన్నికలు విజయవంతం
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:51 PM
ధికారులు సమన్వయంతోనే గ్రామపంచాయ తీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : అధికారులు సమన్వయంతోనే గ్రామపంచాయ తీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన ఎన్నికలు ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా విజయవంతం చేయడంలో అధికారి కృషి ఎన లేనిదని కలెక్టర్ తెలిపారు. శనివారం నాగర్‌క ర్నూల్ పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హా ల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల విజయోత్స వ అభినందన సభను జిల్లా పంచాయతీ అధి కారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎన్నికల ని ర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. కలెక్టర్ మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిం చిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అందరూ సమన్వయంతో ప ని చేయడం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వ హించగలిగామని తెలిపారు. అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ బదావత్ సంతోష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్‌నాయక్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, ఎన్నికల విధులు నిర్వహించిన నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.