హాస్టల్ సంక్షేమ అధికారి, ఏఎన్‌ఎంల సస్పెన్షన్
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:59 AM
గత వారం ఇంటర్ పరీక్ష రాసేందుకు సెంటర్‌కు వచ్చిన ఓ బాలిక అదే సెంటర్‌లోని బాత్రూంలో డెలివరీ కావడం.. ఆ బిడ్డ మృతి చెందడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
పాల్వంచ బాలిక డెలివరీ ఘటనలో చర్యలు
పాల్వంచ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : గత వారం ఇంటర్ పరీక్ష రాసేందుకు సెంటర్‌కు వచ్చిన ఓ బాలిక అదే సెంటర్‌లోని బాత్రూంలో డెలివరీ కావడం.. ఆ బిడ్డ మృతి చెందడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనపై గిరిజన సంక్షేమశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించారు. ఈ మేరకు హాస్టల్ సంక్షేమాధికారి లక్ష్మి, ఏఎన్‌ఎం సంధ్యను సస్పెండ్ చేస్తూ ఐటీడీవో పీవో రాహుల్ బుధవారం ఉత్తర్వులిచ్చారు.