క్షమాపణ చెప్పకుంటే ఐపీఎస్ అసోసియేషన్‌పై ప్రివిలేజ్ మోషన్: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:54 AM
తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే...
హుజూరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే, అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ (సభా హక్కుల ఉల్లంఘన నోటీసు) ప్రవేశపెడతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మత మార్పిడులు చేస్తున్నారని తాను అన్నట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శనివారం ఒక ప్రకటనలో విడదల చేశారు. తాను అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరిస్తూ ఐపీఎస్ అధికారుల సంఘం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని, అందుకే అసెంబ్లీ వేదికగా దీనిపై పోరాడుతానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.