kumaram bheem asifabad- ఊపందుకున్న వరి నాట్లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:49 PM
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు ఊపందుకు న్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూలై చివరి వారంలో జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
- నిండిన చెరువులు, కుంటలు
- ముమ్మరంగా ఖరీఫ్ సాగు పనులు
ఆసిఫాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు ఊపందుకు న్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూలై చివరి వారంలో జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. జూలై చివర లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు మండలాల్లో అదనపు వర్షపాతం నమో దైంది. చెరువులు, కుంటలు చాలా వరకు జలకళ సంతరించుకున్నాయి. ఇందులో కొన్ని అలుగు పోస్త్తున్నాయి. జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 598.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 646.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు మండలాల్లో అదనపు వర్షపాతం నమోదైంది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 15 మండలాలలో జూన్ 1 నుంచి జూలై మూడో వారం వరకు 9 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా మిగితా 6 మండలాలల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇందులో బెజ్జూరు మండలంలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. జైనూర్, లింగాపూర్, రెబ్బెన, ఆసిపాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట. దహెగాం మండలాల్లో లోటు వర్షపాతం నయోదు అయింది. సిర్పూర్ (యు), తిర్యాణి, సిర్పూర్(టి), కౌటాల, చింతలమా నేపల్లి, కెరమెరి, మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కాగా వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు లేని లోటు తీరినైట్లెంది. వాస్తవంగా సీజన్ ఆరంభం నుంచి మంచి వర్షాలు లేవు. దీంతో పంటల సాగు కొంత ఆలస్యమైంది. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలతో మెట్ట పంటల సాగు దాదాపు దగ్గర పడింది. ఇంకా సాగు కావాల్సిన పంటలకు ప్రస్తుతం కురిసిన వర్షాలు ఊతం ఇవ్వనున్నాయి.
అధికారుల అంచనా ప్రకారం..
జిల్లాలోని 15 మండలాలలో ఈ వానాకాలం సీజన్‌లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేశారు .పత్తి 3,70,919 ఎకరాలు, వరి పంట 42,228 ఎకరాల్లో సాగవుతుం దని అంచనా వేశారు. కాగా కంది పంట 20,817, సోయా పంట 1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో అలాగే ఇతర పంటలైన జొన్న, పెసర, మినుములు, మిరప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వు లు 11,254 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు. .జిల్లాలో ఎక్కువగా రైతులు వానాకాలం సీజన్‌లో వర్షాధార పంటలనే సాగు చేస్తారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు ఉపిరి పోసాయి. భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటల సాగుకు డోకా లేదు. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వరితోపాటు పత్తి, కంది ఇతర పంటల సాగు జోరందుకున్నది. ఇప్పటి కే పత్తి పంటల్లో కలుపు తీయడంతో పాటు ఎరు వులు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు, ఇక వరినాట్లు కూడా జోరందుకున్నాయి.