Share News

వరిధాన్యం కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి

ABN , Publish Date - May 17 , 2026 | 11:16 PM

ధాన్యం కొనుగోలు, దిగుమతుల్లో ఆలస్యం చేయకుండా వెంట వెంటనే చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

వరిధాన్యం కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి

చెన్నూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు, దిగుమతుల్లో ఆలస్యం చేయకుండా వెంట వెంటనే చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ గిడ్డంగుల సముదాయం గోదాము వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులతో కలిసి ని రసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులుగా లారీలు, ట్రాక్టర్లలో ధాన్యం లోడ్‌ చేసుకుని దిగుమతి కో సం రైతులు ఎదురు చూస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అధి కా రుల అలసత్వం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రైతులు ఇబ్బం దులు పడుతున్నా మంత్రి వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ పట్టించుకోవడం లేదన్నారు. వారు పదవులు అనుభవించడానికే ప రిమితయ్యారని, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు గోదాము వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. అధికారంలో ఉన్న మంత్రి చెబితే ఇక్కడకు వచ్చి తమను అడ్డు కుంటారా అని బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే మంత్రి స్పందించి స కాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే శారు. లేకుంటే ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించా రు. బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:16 PM